కడప జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారం

First Published 3, Apr 2018, 5:29 PM IST
a teenage boy raped by eight years old boy
Highlights
పట్టపగలే దారుణం

కడప జిల్లాలో ఓ కామాందుడు అభం శుభం తెలియని ఓ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కల్లు మూసుకుపోయి బాలుడిని లైంగికంగా దాడిచేయడంతో  పాపం బాలుడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇదే నొప్పితో ఇంటికి చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు పోలీసులకు ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కడప పట్టణంలో రాగి మల్లేష్ అనే యువకుడు చెత్త సేకరిస్తూ జీవనం  కొనసాగిస్తాడు. అయితే ఇతడు ఇవాళ స్కూల్ కి వెళుతున్న ఓ ఎనిమిదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి దగ్గర్లోని పొదల్లోకి తీసుకెళ్లాడు.అక్కడ బాలుడిపై దారుణంగా లైంగిక దాడికి దిగాడు. ఈ దాడితో తీవ్రంగా గాయపడిన బాలుడు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో వారు నగరంలోని రిమ్స్‌ పోలీసుస్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రిమ్స్‌ సీఐ పురుషోత్తంరాజు  తెలిపారు. ఈ అసాధారణ లైంగిక దాడికి పాల్పడిన యువకుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపాడు.
 

loader