ఈ-కామర్స్‌ దిగ్గజం  అమెజాన్‌ మరో  స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది.. ఇటీవలే స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన అమేజాన్.. తాజాగా ఒక ఫోన్ ని విడుదల చేసింది. కాగా.. నూతన సంవత్సరంలో మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.  టెనార్‌ బ్రాండ్‌ నేమ్‌ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను చేయనుంది.

టెనార్‌ ఇ , టెనార్‌ జీ పేరుతో   ఇప్పటికే రెండు డివైజన్ లను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో మరో తాజా స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌  చేయనుంది.  తన ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ లాంచింగ్‌ కొద్ది రోజుల ముందు అమెజాన్‌ వీటిని లాంచ్‌  చేసిన సంగతి విదితమే.ఎంపిక, ధరలను అర్థం చేసుకోవటానికి , సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడంలో తాము ముందుంటామని కంపెనీ ఈ సందర్భంగా తెలిపింది.