Asianet News TeluguAsianet News Telugu

ఇదీ ఇండియా ‘బడ్జెట్ చరిత్ర’

ఇంతవరకు 25 మంది ఆర్థిక మంత్రులు 87 బడ్జెట్ లు ప్రవేశపెట్టారు

A brief history of India budget

భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు 25మంది ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు.  వారంతా కలసి మొత్తం 87 బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. ఇపుడు ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నది 88వ బడ్జెట్.

A brief history of India budget

 

బడ్జెట్ అనే పదం.. బొగొట్టే అనే పదం నుంచి వచ్చింది. అంటే ఫ్రెంచ్ లో లెదర్ బ్యాగ్( తోలు సంచి) అని అర్థం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, పన్ను ప్రతిపాదనల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని ఏకీకృతం చేయడానికి, ప్రభుత్వ భవిష్యత్ వ్యయాల గురించి తెలియజేసేదే బడ్జెట్.

భారతదేశంలో తొలిసారి బడ్జెట్ ని 1860వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన  ప్రవేశ పెట్టారు. అప్పటికి మన దేశం బ్రిటీష్ వారి పాలనలో ఉంది. ఆ సమయంలో జేమ్స్ విల్సన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనే తొలిసారిగా బడ్జెట్ ని మనదేశంలో ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుందన్నవిషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడానికి వారం ముందు నుంచే బడ్జెట్ కి సంబంధించిన పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతారు. పత్రికలు, మీడియా ఇతరులకు దీనికి సంబంధించిన సమాచారం తెలియకుండా జాగ్రత్తపడతారు. తొలిరోజుల్లో బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్ లో ప్రచురించేవారు. కానీ.. 1980 నుంచి వాటిని న్యూ ఢిల్లీలోని మిన్టో రోడ్డులో ప్రింట్ చేయడం ప్రారభించారు.

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వత తొలి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముకమ్ శెట్టి పనిచేశారు. 1947లో దేశానికి స్వాతంత్య్రంరాగా.. 1948లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా.. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 95రోజులు ముందుగానే అప్పటి దేశ ఆర్థిక పరిస్థితిని షణ్ముకమ్  విశ్లేషించాడు.

A brief history of India budget

షణ్ముకమ్ తర్వాత కేసీ న్యోగి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన ఆ పదవిలో కేవలం 35రోజులు మాత్రమే కొనసాగారు. ఆయన తర్వాత జాన్ మతాయి మూడో ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈయన 1950-51ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సీడీ దేశ్ ముఖ్ ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశ తొలి ఆర్బీఐ గవర్నర్ సీడీ దేశ్ ముఖ్.

1955నుంచి బడ్జెట్ ప్రతులను హిందీ భాషలో ప్రచురించడం ప్రారంభించారు. జవహర్ లాల్ నెహ్రు మన దేశ తొలి ప్రధాని. ఈయన 1958-59 మధ్య కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. 1959 తర్వాత మోరార్జీ దేశాయ్.. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన పార్లమెంట్ లో 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అన్నిసార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఘనత కేవం మెరార్జీకి మాత్రమే దక్కింది.  లీపు సంవత్సరాలైన 1964,1968లలో మోరార్జీకి ఫిబ్రవరి 29వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే రోజు ఆయన పుట్టిన రోజు కూడా కావడం విశేషం.

1973-74 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ని బ్లాక్  బడ్జెట్ అని పిలుస్తారు. ఎందుకంటే అప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి రూ.550కోట్లు లోటు బడ్జెట్ ఏర్పడింది.

1979లో మోరార్జీ దేశాయ్.. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ బాధ్యతలను ఇందిరాగాంధీ స్వీకరించారు. ఆమె తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

A brief history of India budget

 1987లో బడ్జెట్ ని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు. తొలిసారిగా కార్పొరేట్ ట్యాక్స్ ని ఆయన పరిచయం చేశారు.

1991లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యశ్వంత్ సిన్హ తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్.. సర్వీస్ ట్యాక్స్, విదేశీ పెట్టుబడులు విధానాన్ని పరిచయం చేశారు. అంతేకాకుండా దిగుమతి సుంకాన్ని 300 నుంచి 50శాతానికి తగ్గించారు.

A brief history of India budget

ఒకానొక సమయంలో దేశంలో రాజకీయం సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో 1996లో చిదంబరం ఎలాంటి డిబెట్ లేకుండానే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. తర్వాత సంవత్సరం తిరిగి డ్రీమ్ బడ్జెట్ ని ఆయన ప్రవేశపెట్టారు. 2009-12 మధ్య ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రి ఉన్నారు. యుపిఎ బడ్జెట్ లను ప్రవేశపెట్టారు.

A brief history of India budget

2000 సంవత్సరం వరకు కేంద్ర బడ్జెట్.. సాయంత్రం 5గంటల సమయంలో ప్రవేశపెట్టేవారు. కానీ.. 2001లో యశ్వంత్ సిన్హ ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త ట్రెండ్ సృష్టించాడు. మధ్యాహ్నం 1గంట సమయంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టాడు.

A brief history of India budget

ఆ సమయంలోనే సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ ని కూడా పరిచయం చేశారు. అప్పుడు అటల్ బిహారి వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే.. యశ్వంత్ సిన్హ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీసారి దేశంలో ఏదో ఒక విపత్తు జరిగింది. 1991లో విదేశీ సంక్షోభం, 1999లో పోఖ్రాన్ పేలుళ్లు, 2000లో కార్గిల్ యుద్ధం, 2001లో గుజరాత్ లో భూకంపం లాంటివి జరిగాయి.

 నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జెండర్ బడ్జెట్, ఎన్ఆర్ఈజీఏ వంటి పథకాలను 2005-06 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో పరిచయం చేశారు.

 

A brief history of India budget

అత్యధికంగా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మోరార్జీ దేశాయ్ కాగా.. ఆయన తర్వాతి స్థానంలో ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా, వైబీ చావన్, సీడీ దేశ్ ముఖ్ లాంటివారు ఉన్నారు. వీరంతా 7సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్, టీటీ కృష్ణమాచారిలు ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, వెంకట్రామన్, హెచ్ ఎం పటేల్ లు మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జశ్వంత్ సింగ్, వీపీ సింగ్, సి సుబ్రహ్మణ్యం, జాన్ మతాయి, ఆర్కే షణ్ముఖంలు రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios