లెక్కలు చేయలేదని విద్యార్థిని గొంతులో కర్రతో పొడిచిన టీచర్

First Published 14, Apr 2018, 6:00 PM IST
8 year old boy in  icu after teacher pierces his throat
Highlights

సాధారణంగా విద్యార్థులు హోం వర్క్ గానీ, చెప్పిన పని గాని చేయకపోతే టీచర్ లు వారిని దండిచడం చూస్తుంటాం. కొందరు బెత్తంతో చేతులపై కొడుతుంటారు. మరి కొందరు గుంజీలు తీయించడం, గోడ కుర్చీ వేయించడం గానీ చేస్తుంటారు. కానీ మహారాష్ట్ర పుణె లో ఓ గణితం టీచర్ తాను చెప్పిన లెక్కలు చేయలేదని ఏకంగా ఓ విద్యార్థిపై హత్యాయత్నమే చేశాడు. విద్యార్థి గొంతులో కర్రతో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పుణెలోని పింపాల్‌వాడికి చెందిన రోహన్ డీ జాంజిర్(8) అనే విద్యార్థి స్థానికంగా వున్న ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో చంద్రకాంత్ షిండే అనే టీచర్ గణిత టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థులకు లెక్కలు చెపుతున్న క్రమంలో ఇతడు జాంజిర్ ను లేపి ఓ లెక్క చేయమన్నాడు. అతడికి  సమాధానం రాకపోవడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన చంద్రకాంత్ ఆవేశంతో విద్యార్థి గొంతులో కర్రతో పొడిచాడు. దీంతో విద్యార్థికి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నబాధిత విద్యార్థికి మాట్లాడడం కానీ, ఆహారం తీసుకోవడానికి గానీ రావడం లేదు. కేవలం ఆక్సిజన్ సరాఫరా మాత్రమే జరగుతోంది.

ఇలా తమ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
 
loader