మీరు సూపర్ టైపిస్టులా.. ఈ బామ్మగారితో పోటీపడగలరా..? (వీడియో)

First Published 15, Jun 2018, 4:54 PM IST
72 years Old Women work as a type writer
Highlights

మీరు సూపర్ టైపిస్టులా.. ఈ బామ్మగారితో పోటీపడగలరా..?  

మనలో చాలామందికి తమ టైపింగ్ స్పీడ్ మీద బోలెడంత నమ్మకం.. తమలా ఎవరు టైపింగ్ చేయలేరని... తమ స్పీడును వేరొకరు క్రాస్ చేయలేరని నలుగురి దగ్గరా గొప్పలు చెప్పుకుంటారు. అయితే అది కొన్నాళ్ల వరకే.. వారిలో శక్తి ఉన్నంతకాలం అలాగే అనిపిస్తుంది. మరి వయసు పెరిగే కొద్ది అంతే స్పీడ్ మెయింటెన్ చేయగలరా..? అంటే డౌటే... అలాంటి వారికి షాకిస్తోంది. ఈ బామ్మగారు..

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందని 72 ఏళ్ల లక్ష్మీబాయ్ అనే బామ్మ .. ఈ వయసులో కృష్ణా, రామా అనుకుంటూ కూర్చోకుండా..కష్టపడుతూ కుర్రకారుకి సవాల్ విసురుతోంది. సెహర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టైప్ రైటర్‌గా పనిచేస్తూ.. దరఖాస్తులు నింపడం.. ఫిర్యాదులు టైప్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు.. ఆమె స్పీడ్ చూసి చాలా మంది బామ్మగారి దగ్గరకే వస్తున్నారు..

వయసు పెరిగిందని మూల కూర్చోకుండా కష్టపడుతూ తన తోటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది లక్ష్మీ బాయ్. ఈమె టైపింగ్ స్పీడ్ చూసి ముచ్చటపడిన ఓ వ్యక్తి  బామ్మగారు పనిచేస్తుండగా వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. దీనిని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేశాడు. 

                           "

loader