ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూపాయికే స్మార్ట్ ఫోన్

ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూపాయికే స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ సమ్మర్ మెగాసేల్ ఆఫర్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 13 నుంచి 16 వరకు నాలుగు రోజులపాటు  ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్’ ను నిర్వహిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఫ్యాషన్, అప్లయెన్సెస్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నట్టు ఈ సంస్థ తెలిపింది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను బ్యాంకు క్రెడిట్ కార్డులు, బజాజ్ కార్డులపై అందిస్తోంది. అలాగే, డెబిట్ కార్డులపై ‘బై నౌ పే లేటర్’ అవకాశం కల్పిస్తోంది.

ఓ చిన్న ఆటను ప్లే చేయడం ద్వారా ల్యాప్‌టాప్ లు, మొబైల్స్‌‌ను కేవలం ఒక్క రూపాయికే సొంతం చేసుకొనేలా ఫ్లిప్‌కార్ట్ అవకాశం కల్పించనుంది. మార్కెట్ ధర రూ. 28,800గా ఉన్న 32 ఇంచుల హెచ్‌డీ టీవీని రూ.16,999కే అందిస్తోంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌ల మీద రూ.37,000 ఆఫర్‌‌తో, రూ.17,900 ధర ఉన్న శాంసంగ్ గెలక్సీ ఫోన్లను డిస్కౌంట్‌లకు పోగా 7000-10000లకు, రూ. 61,000 ధర ఉన్న గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2XL 26,001-34,999 మధ్య ఇవ్వనుంది. అలాగే, బిగ్ షాపింగ్ డేస్ రోజున కొన్న వాటిపై నూరు శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. మొబైల్ ఫోన్లపై ఇంతవరకు చూడని తగ్గింపులను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, టీవీలు.. ఇతర వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos