ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన అరవైయేళ్ల వృద్దుడు

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన అరవైయేళ్ల వృద్దుడు

కామంతో కల్లు మూసుకుపోయిన ఓ వృద్దుడు తన మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఇతడిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడిని పోలీసులు విచారిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులో ఆర్టీసి విశ్రాంత ఉద్యోగి అశోక్ కుమార్(60) తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి భార్య అస్మిత సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాలలో  టీచర్ గా పనిచేస్తోంది.అలాగే స్కూల్ పిల్లలకు సాయంత్రం సమయంలో ఇంటి వద్ద
ట్యూషన్ చెబుతుంది. అయితే నిన్న సాయంత్రం ఆమె స్కూల్ నుండి రావడం ఆలస్యమైంది. దీంతో ఇంట్లో ఒంటరిగా వున్న అశోక్ కుమార్   ట్యూషన్‌కి వచ్చిన ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారి ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారి తల్లితండ్రులు గోపాలపురం పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపి  అశోక్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారుఅలాగే చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos