ఆరేళ్ల పిల్లాడి సంవత్సర ఆదాయం.. రూ.70కోట్లు

ఆరేళ్ల పిల్లాడి సంవత్సర ఆదాయం.. రూ.70కోట్లు

ఆరేళ్ల పిల్లాడు.. సంవత్సరం తిరగకుండా రూ.70కోట్లు సంపాదించాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది వాస్తవం.  ఆ పిల్లాడేమీ సినిమా స్టార్ కూడా కాదు. అతనికి ఆంత్రీయ శక్తులు కూడా లేవు. కేవలం బొమ్మలతో ఆడుకుంటూనే ఈ ఘనత సాధించాడు.

వివరాల్లోకి వెళితే.. పిల్లలకు బొమ్మలంటే ఇష్టం ఎలాగో ర్యాన్‌కు అంతే.. కాకపోతే అది కాస్త ఎక్కువ. ఒక బొమ్మ అతని చేతికి చిక్కిందంటే దానిని క్షణ్ణంగా పరిశీలిస్తాడు. అదేంటో.. దాంట్లో ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా అధ్యయనం చేసి వివరిస్తుంటాడు. నాలుగేళ్ల వయసులో అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వీడియోలు తీసి.. ర్యాన్‌ టాయ్స్‌రివ్యూ అనే ఓ ట్యూబ్‌ఛానెల్‌ను సృష్టించి అందులో ఆ వీడియోలను అప్‌ డేట్ చేస్తూ వస్తున్నారు. 

ఆ ఛానెల్‌కు 10 లక్షల మందికిపైగా సబ్‌ స్క్రైబర్‌లు ఉన్నారు. ర్యాన్‌ వీడియోలను చూసే చాలా మంది చిన్నారులు బొమ్మలు కొంటుంటారు కూడా. వాటి డెమో ఇచ్చే సమయంలో అతని హవాభావాలు భలేగా ఉంటాయి. ఈ వీడియోలను గానూ అతనికి సదరు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలోనే ముడుతోంది. ఈ ఏడాదికి గానూ11 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.70 కోట్లకు పైగా సంపాదించాడు. ఇటీవల ఫోర్బ్స్ యూట్యూబ్ లో కోట్లు సంపాదిస్తున్న వారి జాబితాను విడుదల చేయగా.. ఈ బుడ్డాడు ఆ జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos