పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లితో ఒక్కటైన దంపతులు.. జీవితాతం ఆనందంగా కలిసి ఉండటంలో.. శృంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మందికి శృంగారానికి సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడంతో.. వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే.. కేవలం చిన్న టిప్స్ ఫాలో అయితే.. శృంగారం విషయంలో మీకు తిరుగు ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఎంటో.. తెలుసుకుందామా..

 

1. ఆరోగ్యకరమైన ఆహారం..

బలవర్థకమైన ఆహారం తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉండగలరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. శృంగార జీవితాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించగలరని నిపుణులు చెబుతున్నారు.

2. పొగతాగడం మానేయాలి..

పొగతాగే అలవాటు చాలా మందిలో ఉండే ఉంటుంది. అయితే.. ఈ అలవాటు ఉన్నవారు కొద్దికాలం తర్వాత శృంగార జీవితాన్ని ఆస్వాదించలేరు. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వారి శరీరంలోని శక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది. అలాగే.. పురుషాంగంతో కనెక్ట్ అయ్యి ఉండే నాళాలకు రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు. దీంతో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

3.సరైన బరువు..

 అధిక బరువుతో ఉండేవారు హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఒబేసిటీ సమస్యలతోపాటు.. సెక్స్ పరంగానూ అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవడం మంచిది.

4.మద్యం సేవించడం..

మద్యం అతి తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. అతిగా తీసుకుంటే స్త్రీ, పురుషుల లైంగిక జీవితం పై ప్రభావంచూపే అవకాశం ఉంది.

5. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్..

లైంగిక జీవితం ఆనందంగా ఉండాలంటే అతి ముఖ్యమైనది ఇదే. మీ పార్టనర్ తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి. మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా జాగ్రత్త పడాలి.

6. సేఫ్టీ ముఖ్యం..

ఏ విషయంలోనైనా వ్యక్తిగత సేఫ్టీ చాలా ముఖ్యం. అదేవిధంగా శృంగార జీవితానికీ ఇది వర్తిస్తుంది. కండోమ్ ని ఉపయోగించడం వల్ల అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ, ఇతర ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.