మందుపాతర పేల్చిన మావోలు: 6గురు జవాన్లు మృతి

6 policemen killed in landmine blast by Maoists
Highlights

ఛత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మందుపాతర పేల్చడంతో ఆరుగురు జవాన్లు మరణించారు. 

దంతెవాడ: ఛత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మందుపాతర పేల్చడంతో ఆరుగురు జవాన్లు మరణించారు. 

దంతేవాడ జిల్లా చోల్నోర్ గ్రామంలో గ్రామం నుంచి పోలీసులు బొలెరో వాహనంలో వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మృతుల్లో ముగ్గురు ఛత్తీస్ గడ్ సాయుధ బలగాలకు చెందినవారు కాగా, ఇద్దరు జిల్లా పోలీసు బలగానికి చెందినవారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 

పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐదు ఆటోమేటిక్ రైఫిళ్లను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. కేంద్ర సాయుధ బలగానికి (సిఆర్పీఎఫ్ కు) చెందిన మరింత మందిని సంఘటనా స్థలానికి పంపించారు. 

గాయపడినవారిని రాష్ట్ర రాజధాని రాయపూర్ ఆస్పత్రికి హెలికాప్టర్ లో తరలించారు. 

loader