Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ లో ఈ ట్రిక్స్ గురించి తెలుసా..?

  • ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తో వినియోగదారుల ముందుకు వస్తున్న వాట్సాప్ లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా..
5 WhatsApp Tricks You Should Be Using

ప్రస్తుత కాలంలో వాట్సాప్ గురించి తెలయని వాళ్లు.. వారి స్మార్ట్ ఫోన్ వాట్సాప్ లేని వాళ్లు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా వినియోగదారులకు వాట్సాప్ చేరువైంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తో వినియోగదారుల ముందుకు వస్తున్న వాట్సాప్ లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా..

1. ఫోటోలను ఎడిట్, ఫిల్టర్స్ చేయవచ్చు..

5 WhatsApp Tricks You Should Be Using

 

వాట్సాప్ మనం ఎందుకు ఉపయోగిస్తాం..? మెసేజ్ చేసుకోవడానికి లేదా ఫోటోలు, వీడియోలు సెండ్ చేసుకోవడానికే కదా.  ఇప్పటి వరకు మీరు చాలా ఫోటోలు, వీడియోలు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఉండి ఉండచ్చు. అయితే.. ఫోటోలను వాట్సాప్ లోనే ఎడిట్ చేయవచ్చు.. ఫిల్టర్స్ యాడ్ చేయవచ్చు అన్న విషయం మీకు తెలుసా..? ఇప్పుడు మీరు ఒక ఫోటోని ఎవరికైనా షేర్ చేస్తున్నా లేదా.. వాట్సాప్ స్టేటస్ గా పెడుతున్నా.. ‘ స్వైప్ అప్ ఫర్ ఫిల్టర్స్’ అనే ఆప్షన్ కనపడుతుంది. మీరు గమనించారో లేదో.. అలా కనుక చేస్తే.. మీరు మీ ఫోటోలను మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు.

2.స్టేటస్ అందరికీ కాదు.. కొందరికే..

ఒకప్పుడు వాట్సాప్ లో స్టేటస్ అంటే.. మన మనసులో మాటలను పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని ఫోటో పెట్టుకునే విధంగా మార్చింది వాట్సాప్. అయితే.. మీరు పెట్టుకునే స్టేటస్ అందరూ చూడటం మీకు ఇష్టం లేకపోతే.. కేవలం ఎవరెవరు చూడాలో కూడా మీరు ఎంచుకోవచ్చు. ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి.. అందులో ఎకౌంట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. అందులో ప్రైవసీ బటన్ ని ఎంచుకుంటే  స్టేటస్ కనపడుతుంది. దానిని క్లిక్ చేస్తే.. మీకు మూడు ఆప్షన్స్ కనపడతాయి. ‘ మై కాంటాక్ట్స్’, ‘ మై కాంటాక్ట్ ఎక్సెప్ట్’, ‘ ఓన్లీ షేర్ విత్’.  ఈ మూడింటింలో మీకు నచ్చిన ఆప్షన్ ని ఎంచుకుంటే సరిపోతుంది. అప్పుడు మీ స్టేటస్ ఎవరు చూడాలని మీరు అనుకుంటున్నారో వారు మాత్రమే చూస్తారు.

టెక్ట్స్ ఫార్మాట్

వాట్సాప్ లో మీరు మీ స్నేహితులకు పంపే మెసేజ్ సాధారణంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకుంటే టెక్ట్స్ ఫార్మాట్ మార్చుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా పంపించవచ్చు. ఎలా అంటే ఏదైనా పదానికి ముందు, వెనక * కనుక యాడ్ చేస్తే ఆ పదం బోల్డ్ లోకి మారుతుంది. అలా కాకుండా ఏదైనా పదానికి _ వాడితే అది ఇటాలిక్ లోకి మారుతుంది.

నోట్ ప్యాడ్..

5 WhatsApp Tricks You Should Be Using

వాట్సాప్ లో ప్రత్యేకంగా నోట్ ప్యాడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే.. ఉదాహరణకు మీ ఫ్రెండ్ ఎవరైనా మీకు ముఖ్యమైన మెసేజ్ పంపించారనుకుందాం. దానిని మీరు దాచిపెట్టాలనుకున్నారునుకోండి.. దానిపై క్లిక్ చేస్తే.. పైన మనకు స్టార్ ఆప్షన్ కనపడుతుంది. దానిని క్లిక్ చేస్తే.. అది బుక్ మార్క్ అవుతుంది. అది మీకు తెలిసిందే. అలా కాకుండా.. ప్రత్యేకంగా మెసేజ్ ని ఓ స్పెషల్ చాట్ బాక్స్ ఓపెన్ చేసుకొని తర్వాత చదువుకోవచ్చు. ఎలా అంటే మీరు ప్రత్యేకంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అందులో మీతో పాటు ఇంకెవరినైనా యాడ్ చేసి.. గ్రూప్ క్రియేట్ అయ్యాక వారిని తీసేయండి. అప్పుడు గ్రూప్ లో మీరు మాత్రమే ఉంటారు. అందులో మీకు నచ్చినవి పోస్టు చేసుకోవచ్చు. మీ ఒక్కరికి మాత్రమే కనపడతాయి. ఆ గ్రూప్ కి ‘నోట్స్’, ‘ సెల్ఫ్’ అని పేరు పెట్టుకోవచ్చు.

డెలీట్ ఫర్ ఎవ్రీవన్..

మీరు ఏదైనా మెసేజ్ పొరపాటున ఒకరికి పంపించబోయి.. మరొకరికి పంపారనుకోండి. వెంటనే ఆ మెసేజ్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ని ప్రవేశపెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios