టేస్టీ చీజ్ తో గుండె జబ్బుకి చెక్

40gm of cheese every day may reduce heart stroke risk
Highlights

  • చీజ్ తో ఎన్నో ఉపయోగాలు
  • రోజుకి 40 గ్రాముల చీజ్ గుండెకి ఎంతో మేలు

‘‘చీజ్, నెయ్యి లాంటివి ఎక్కువగా తినకూడదు.. తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. హార్ట్ ఎటాక్స్ వస్తాయి’’ ఇలాంటి అపోహ మనలో చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే.. చీజ్ తినడం వల్ల ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు రాకపోగా.. అలాంటి జబ్బులు రాకుండా రక్షణ పొందవచ్చు. చైనాలోని సాచూ యూనివర్శిటీకి చెందిన నిపుణులు దీనిపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల ప్రకారం.. ప్రతి రోజూ 40 గ్రాముల చీజ్ తీసుకోవడం చాలా మంచిదట.

అలా తీసుకోవడం వల్ల.. చీజ్ లోని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్.. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రక్షణగా నిలుస్తాయి. అంతేకాదు.. చీజ్ తీసుకోవడం వల్ల మానవ శరీరంలోని బ్యాడ్ కొలిస్ట్రాల్ ని తగ్గించి.. మంచి కొలిస్ట్రాల్ ని పెంచుతుంది. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గడిచిన ఐదు, పదేళ్లలో హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని.. నిపుణులు చెబుతున్నారు. వాటి నుంచి తప్పించుకునేందుకు చీజ్ సహాయపడుతుందని వారు తెలిపారు.

loader