Asianet News TeluguAsianet News Telugu

బంగారు కొనేందుకు నాలుగు తెలివైన మార్గాలు...

  •  ఇండియా లో బంగారు కొనడమంటే పండగ, సంపద పోగేసుకోవడం
  •  బంగారులో పెట్టుబడి పెట్టడమంటే, ఇంటికి తీసుకొచ్చి లాకర్ పెట్టి బిగించేయడమేనా మార్గం
  • ముట్టుకోకుండా బంగారు లో పెట్టుబడులు పెట్టే మార్గాలున్నాయి,  చూడండి
4 smart ways to buy gold without actually owning it

 

ఇండియాలో బంగారంఅంటే  ఏక్కువ మోజుపడేది దక్షిణభారత దేశం వాళ్లే. మిడియా రిపోర్టుల ప్రకారం ఇండియాలో జరిగే బంగారం కొనుగోళ్లలో 40 శాతం వాటా సౌతిండియా వాళ్లదే. బంగారం కొనడం అనేది అందరికి ఇష్టమయన పెట్టుబడి పెట్టేవిధానం. ఎందుకు కాకూడదు? బంగారం అరుదైనలోహం.ఇతర లోహాల లాగా తుప్పుపట్టేది  కాదు. ఒక  రకం నుంచి మరొక రకానికి బంగారాన్ని మార్చుకోవడం, అమ్ముకోవడం  చాలా సుళవు. ముఖ్యంగా భారతదేశంలో బంగారంటే పండగ, వైభవం.

అయితే, బంగారం నగలుగా ధరించేందుకు, కాన్కగా ఇచ్చేందుకు, నలుగురి మందుప్రదర్శించేందుకు బంగారం కొనాలనుకుంటే పర్వాలేదు. అయితే, పెట్టుబడిరూపంలో బంగారాన్నుంచుకోవాలంటే కచ్చితంగాకొని తీరాల్సిందేనా? లేదు. దీనికి చాలా మార్గాలొచ్చాయి.

సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్ జిబి)

దీనిని భారతప్రభుత్వం ప్రారంభించింది. ఏకంగా బంగారాన్ని కొనే దాచుకునే అలవాటు తగ్గించేందుకు ఈ బాండ్లను తీసుకువచ్చారు.  ఏడోవిడత 2017  మార్చిలో వచ్చింది. ఈ బాండ్లను కొంటే పెట్టుబడి పెరగడమే కాదు, 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఇది గవర్నమెంట్ బాండ్ కాబట్టి, క్రెడిట్ రేటింగ్ కూడా బాగా ఉంది. కుటుంబ సభ్యుల పేరు మీద ఎవరైనా వ్యక్తులు ఏడాదికి 500 గ్రాముల దాకా బంగారు బాండ్లు కొనవచ్చు. పేపర్ రూపంలో నే కాదు డిమాట్ రూపంలో కూడా ఈ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ బిఎఫ్ సి, పోస్టాఫీసులు, ఇతర సంస్థల ద్వార వచ్చే విడతలో ఈ బాండ్లను మీరు కొనవచ్చు. ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండండి.

బంగారు ఇటిఎప్

ఇటి ఎఫ్ అంటే ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్.  అసెస్ మెనేజ్ మెంట్ సంస్థ (ఎఎంసి)లే ఇటిఎఫ్ లను విక్రయిస్తుంటాయి. స్టాక్స్ లాగా వీటితో వ్యాపారం చేయవచ్చు. ఇటిఎఫ్ కు ఎంట్రీ,ఎగ్జిట్ భారం ఉండదు. మీఇన్వెస్ట్ మెంటకు రియల్ టైం బంగారు ధరలతో లింక్ ఉంటుంది. ఒక గ్రామ్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ మెంట్ చేయవచ్చు.  ఇటిఎఫ్ లన్నింటిని డిమ్యాట్ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని కల్తీబెడద, దొంగల భయం కూడా ఉండదు. అయితే, కొనేటప్పుడు అమ్మేటప్పడు బ్రోకరేజ్ చార్జీ పడుతుంది, అసెస్ మేనేజ్ మెంట్ కంపెనీలకు కొంతరుసుం చెల్లించాల్సి ఉంటుంది.

గోల్డ్ మ్యూచ్యువల్ ఫండ్స్

మ్యూచ్చువల్ పండ్స్ రకరకాల సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అందులో గోల్డ్ ఇటిఎఫ్ ఒకటి. ఎఎంసిలు ఇటిఎఫ్ లు గోల్డ్ లింక్డ్ మ్యూచ్యువల్ ఫండ్స్ అందిస్తుంటాయి. అతి తక్కువ గా అంటే రు. 500 లనుంచికూడా మీరు ఇన్వెస్టు చేస్తూ ఉండవచ్చు. పరిమితి లేకుండా వీటిని మీరు అమ్ముకోవచ్చు, కుదవపెట్టుకోవచ్చు. మూడేళ్ల కంటే తక్కువ కాలంలో యూనిట్లను వదలుకోవాలనుకంటే  ఎస్టిసిజి  టాక్స్ పడుతుంది. మూడేళ్ల కంటే ఎక్కువ రోజులుంచుకుంటే ఎల్టీసిజి టాక్స్  వర్తిస్తుంది. ఇది ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తో కలసి 20.6శాతం దాకా ఉంటుంది.

ఇ-వాలెట్

ఒక ప్రముఖ ఇ- వాలెట్ సంస్థ  ఈ మధ్యనే ఒక బంగారు పథకం ప్రకటించింది. ఇ వాలెట్ నుంచి కస్టమర్లు డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. ఈ ఇ-వాలెట్ సంస్థ ఎంఎంటిసి-పిఎఎంపి ల భాగస్వామ్యంతో ఈ స్కీం ప్రకటించింది. ఈ డిజిటల్ గోల్డ్ ను అయిదేళ్లుంచుకోవచ్చు.  అవసరమయినపుడు డిజిటల్ గోల్డ్ ను  నిజమయినబంగారంగా మార్చుకోవచ్చు. నేరుగా ఇంటికేతీసుకు వచ్చి ఇస్తారు. అంతేకాదు, ఇ- వాలెట్ నుంచి ఆన్ లైన్ లో కూడా అమ్మేసుకోవచ్చు.

 

4 smart ways to buy gold without actually owning it

 

 

(రచయిత బ్యాంక్ బజార్.కామ్ సిఇవొ)

 

 

Follow Us:
Download App:
  • android
  • ios