వారణాసిలో కుప్పకూలిన ఫ్లై ఓవర్: 18 మంది మృతి

First Published 16, May 2018, 12:41 AM IST
26 dead after under-construction flyover collapses in Varanasi
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. 

వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వారణాసిలోని కాంట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. 

శిథిలాల కింద ఇంకా 20 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చాలా మంది గాయపడ్డారు మృతుల్లో ఎక్కువ మంది కూలీలని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ప్రమాదం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆయన డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను, మంత్రి నీల్ కాంత్ తివారీలను ఆదేశించారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదంలో ఓ బస్సుతో పాటు వాహనాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురిని రక్షించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ బ్రిడ్జి కనస్ట్రక్షన్ కార్పోరేషన్ ఈ 2261 మీటర్ల పొడవైన వంతెనను రూ.129 కోట్లతో నిర్మిస్తోంది. 

loader