Asianet News TeluguAsianet News Telugu

sms కి 25ఏళ్లు

  • ఎస్ఎంఎస్ పుట్టి 25ఏళ్లు
  • మొదటి ఎస్ఎంఎస్ ఏమిటో తెలుసా?
25 Years Ago Today the First SMS Was Sent

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారి సంఖ్య చాలా తక్కువ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాలం కడిపేస్తున్నారు. ఇప్పడంటే టెక్నాలజీ పెరిగిపోయి అందరూ వాట్సాప్ లో మేసేజ్ లు చేసుకుంటున్నారు కానీ.. వీటికి ముందు అందరూ సాధారణ sms ( షార్ట్ మెసేజ్ సర్వీస్)లు చేసుకునేవారు. వినియోగదారుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని టెలికాం సంస్థలు స్పెషల్ గా ఎస్ఎంఎస్ ఆఫర్లు ప్రకటించేవి. అలాంటి ఎస్ఎంఎస్ పుట్టి సరిగ్గా 25 ఏళ్లు గడిచింది.

మొట్టమొదటిసారి 1992 డిసెంబర్ 2న నెయిల్ పాప్ వర్త్ అనే ఇంజినీర్ తొలి సందేశాన్ని పంపించారు. వోడాఫోన్ నెట్‌వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్సెమ్మెస్‌ 'మెర్రీ క్రిస్మస్'. ఆ సమయంలో వోడాఫోన్‌కు డైరెక్టర్ గా ఉన్న రిచర్డ్ జార్విస్ ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి. ఆ మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్సెమ్మెస్ లు పంపించే మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1999లో ఇతర నెట్‌వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది. జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమే. ఆ తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం, ఆపై స్మార్ట్‌ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్‌లు పంపడం, ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సప్‌ లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు.

తొలి సందేశాన్ని పంపిన పాప్‌వర్త్ ప్రస్తుత అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. '1992లో నేను పంపిన సందేశం ఇప్పుడు ఇంత ఫేమస్‌ అవుతోందని భావించలేదు. తొలి సందేశాన్ని పంపింది నేనేనని నా పిల్లలకు కొన్ని రోజుల కిందట చెప్పగా.. వారు ఎంతో సంతోషించారు. నా తొలి ఎస్సెమ్మెస్ మొబైల్ చరిత్రలోనే ఓ కీలక ఘట్టమని' ఇంజినీర్ పాప్‌వర్త్ వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios