ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ యమహా కంపెనీ భారత మార్కెట్ లోకి కొత్త బైక్ ని ప్రవేశపెట్టింది. యమహా ఎఫ్ జడ్-ఎస్ఎఫ్ఐ పేరిట ఈ బైక్ ని విడుదల చేసింది. ఎఫ్ జెడ్ సిరీస్ ని అప్ డేట్ చేసి దీనిని విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. దీని ధర రూ.86,042( ఢిల్లీ ఎక్స్ షోరూమ్) గత సిరీస్ తో పోలిస్తే బ్రేకింగ్ సిస్టమ్, బైక్ ఎఫిషియన్సీని మరింత మెరుగుపరిచినట్లు చెప్పింది.

149 సీసీ కలిగిన ఈ బైక్‌లో ఎయిర్‌కూల్డ్‌ 4-స్ట్రోక్‌ ఇంజిన్‌ ఉంది. ఇందులోని 220ఎంఎం హైడ్రాలిక్‌ సింగిల్‌ వెనుక డిస్క్‌ బ్రేక్‌, 282 ఎంఎం ముందు బ్రేకులు బైక్‌ను సమర్థంగా నియంత్రిస్తాయని కంపెనీ పేర్కొంది. పదేళ్ల క్రితం విడుదలైన ఎఫ్‌జడ్‌ సిరీస్‌ బైక్‌లను ప్రజలు ఎంతగానో ఆదరించారని,  ఈ కొత్త బైక్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లు  యమహా మోటార్‌ ఇండియా సేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెంటింగ్‌) రాయ్‌ కురియన్‌ అన్నారు.