ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్.. తాజాగా మరో బైక్ ని విడుదల చేసింది. టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ లో భాగంగా మట్టే సిరీస్ లో ఈ బైక్ ని మంగళవారం విడుదల చేసింది. టీవీఎస్ విక్టర్ మట్టే కలర్ స్కీమ్ పేరిట బడ్జెట్ ధరలో మార్కెట్ లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.55,890 గా కంపెనీ ప్రకటించింది. ఇది బ్లూ, సిల్వర్ .. రెండు రంగుల్లో లభ్యమౌతోంది. గతేడాది సెప్టెంబర్ లో విడుదల చేసిన ప్రిమియమ్ ఎడిషన్ కి అదనపు హంగులు అద్ది.. ఈ మట్టే సిరీస్ ని విడుదల చేసినట్లు తెలిపింది.

 

గతంలో విడుదల చేసిన ప్రీమియమ్ బైక్ లు వివిధ రంగుల్లో లభ్యమయ్యాయి. కానీ ఇవి కేవలం రెండు రంగుల్లో మాత్రమే లభించనున్నాయి. డిజైన్, ఫీచర్లలో చాలా మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. 109సీసీ సింగిల్ సిలిండర్ తో పనిచేస్తుంది. ప్యూషల్ ఎఫిషియన్సీ ఎక్కువ. లీటర్ ఫ్యూషల్ తో 72కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. 3 వాల్వ్‌ ఎయిర్‌  కూల్డ్‌ ఇంజీన్‌, ఫోర్‌-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ​ 9.5పీఎస్‌  పవర్‌,  9.4ఎన్‌ఎం టార్క్ ఈ బైక్ ఫీచర్లు.