ప్రముఖ వాహనాల తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్స్.. భారత మార్కెట్లోకి మరో రెండు సరికొత్త బైక్స్ ని విడుదల చేసింది. తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ జిక్సర్‌లో 2018 మోడల్‌తో పాటు జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ను కూడా విడుదల చేసింది. జిక్సర్ ఎడిషన్ లోనే అదనపు హంగులతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపనీ తెలిపింది.

దిల్లీ ఎక్స్‌ షోరూంలో జిక్సర్‌2018 మోడల్ ధర రూ.80,928గా, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ధర 90,037గా ప్రకటించారు. ఈ రెండు మోటార్‌ సైకిళ్లలో అల్ట్రాలైట్‌ 155 సీసీ ఇంజిన్‌, సుజుకీ ఎకో ఫర్ఫార్మెన్స్‌ టెక్నాలజీ ఉంది.

ఈ సెగ్మెంట్లో జిక్సర్‌ పూర్తి స్థాయి సౌకర్యవంతమైన వాహనమని సుజుకీ ఇండియా ప్రతినిధి సంజీవ్‌ రాజశేఖరన్‌ తెలిపారు. తమకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌లలో ఈ వాహనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.