2018లో  ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

First Published 20, Dec 2017, 5:02 PM IST
2018 is the most luckiest year for these zodiacsigns
Highlights
  • 2018లో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది

2017 వ సంవత్సరాన్ని వదిలి.. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.ఈ 2017 వ సంవత్సరం కొందరికి బాగా కలిసి వచ్చి ఉండవచ్చు. మరి కొందరకి అసలు కలిసి రాకుండానూ ఉండవచ్చు.  వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అని టెన్షన్ పడే వాళ్లు కూడా ఉంటారు. అయితే.. 2018లో కొన్ని రాశుల వారికి మాత్రం చాలా దివ్యంగా ఉంది అంటున్నారు జ్యోతిష్యులు. వారు పట్టిందల్లా బంగారం అయిపోతుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా..

సింహరాశి

సింహరాశి వారు దాదాపు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వీరిని అదృష్టం వెంటాడుతుంది. 2018 లో వీరు ఏ పని ప్రారంభించినా అన్నీ విజయాలే చేకూరుతాయి. జాబ్ కోసం వెతికేవారు జాబ్ సాధించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారాలు చేసేవారు వారి వ్యాపారాల్లో మంచి లాభాలు సాధిస్తారు. విజయపథంలో దూసుకెళ్తారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు రావు. జీవితభాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వీరి చెంతకు ఎలాంటి సమస్యలు దరి చేరవు. అయితే కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేసే అవకాశం ఉంది. వాటిని చేయకుండా ఉంటే చాలు. ఇక మిగతాపరంగా వీరికి 2018 అన్ని విజయాలనే తెచ్చిపెడుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి కూడా 2018లో తిరుగుండదు. ధనుస్సు రాశి కాస్త ధైర్యం ఎక్కువ. వీరి ఏ పని చేయడానికైనా వెనుకాడరు. వీరికి ఆలోచన శక్తి కూడా ఎక్కువే. 2018లో వీరు అనుకున్న పనిని సాధించే వరకు విశ్రమించరు. కచ్చితంగా వీరు అనుకున్న విషయాలన్నీ సాధిస్తారు. గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరిని అడ్డుకునే దమ్ము కూడా ఎవరికీ ఉండదు. మీది ఒకవేళ ధనుస్సు రాశి అయితే మీరు చేసే పనిలో ఏమాత్రం వెనుకడుగు వేయకండి. కాకపోతే కొన్ని రకాల అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. అయినా ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి. మీకు చాలా రకాల అవకాశాలు వస్తాయి. ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. 2018 మీకు అన్నీ శుభాలే తీసుకురానుంది. ఏదో ఒకట్రెండు సందర్భాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి పరంగానూ మంచి విజయాలను అందుకుంటారు.

కన్యరాశి

2017 లో కన్య రాశివారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో వీరు అన్నీ శుభాలే చూస్తారు. వీరి 2018 కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీకు మీ సన్నిహితులతో, ప్రేమికులతో బంధం మరింత బలపడుతుంది. మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు లేదా ఆరాధించే వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. ఇక నుంచి మీతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం కచ్చితంగా వివాహం జరుగుతుంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి 2018లో బాగా కలిసొస్తుంది. పెళ్లికానివారికి వారికి నచ్చిన వారితో పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత వైవాహిక బంధం కూడా చాలా బాగుంటుంది. 2018లో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. వారి ద్వారా మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టబోయే ప్రతి పని విజయవంతం అవుతుంది.

మీనరాశి

2018లో మీనరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు పెళ్లికాకుంటే త్వరలోనే పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉంది. మీ వైవాహిక జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. మీకు ఇక నుంచి అన్నీ విజయాలే కలుగుతాయి. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా మీకు ప్రతి విషయంలో సహకరిస్తుంది. మీకు 2018 తిరుగుండదు.

 

 

 

  
 

loader