హోండా బైక్స్ పై భారీ ధర తగ్గింపు

హోండా బైక్స్ పై భారీ ధర తగ్గింపు

ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తమ ఫ్లాగ్‌షిప్‌ సూపర్‌బైక్‌ మోడళ్లపై ధరలను భారీగా తగ్గించింది. సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌ మోడల్స్‌పై రూ. 2.5లక్షల వరకు ధరను తగ్గించినట్లు హోండా తెలిపింది. కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్స్‌పై సుంకాన్ని 25శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకే బైక్‌లపై ధరలను తగ్గించినట్లు హోండా తెలిపింది.

తగ్గింపు అనంతరం .. హోండా సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ మోడల్‌ ధర రూ. 16.79లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 14.78లక్షలకు (ఎక్స్‌షోరూం దిల్లీ) పడిపోయింది. ఇక సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ ఎస్‌పీ మోడల్‌ ధర రూ. 21.22లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 18.68లక్షలకు(ఎక్స్‌షోరూం దిల్లీ) తగ్గింది. ఈ న్యూ జెనరేషన్‌ ఫైర్‌బ్లేడ్‌ మోడళ్లను హోండా గతేడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బీఎండబ్ల్యూ, డుకాటి, సుజుకీ, హర్లీ డేవిడ్‌సన్‌, యమహా కూడా తాము దిగుమతి చేసుకుంటున్న సీబీయూ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos