లెక్క ప్రకారం  పవన్ కల్యాణ్  2017 ఇయర్ ఎండ్  సెన్సేషన్ ‘అజ్ఞాత వాసి’  సెన్సార్ పరిశీలన నిన్నటికే పూర్తి కావాలి. పవన్ కల్యాణ్ తో పాటు కీర్తి సురేష్ , అనుఇమాన్యయేల్ నటించిన ఈ చిత్రం పాటలు, టీజర్  యుట్యూబ్ లో రికార్డు సృష్టించాయి. ఈ చిత్రం జనవరి 10 రిలీజ్ కావలసి ఉంది. ప్రపంచవ్యాపితంగా ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులు  ఈ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

2010 వొపెనర్ కాబట్టి బోణి ఎలా ఉంటుందో అనే సెంటిమెంట్ కూడా తోడయింది. అయితే, ఇపుడే అందినవార్త ఏమిటంటే, ఈ చిత్రం సెన్సార్ స్క్రీనింగ్ పూర్తి కాలేదట. సగం చూశాక టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి ప్రదర్శన ఆగిపోయింది. మళ్లీ ఎపుడో సెన్సార్ వాళ్ల డేట్ బయటకు చెప్పడం లేదు. వచ్చే రెండు మూడు రోజులలో సెన్సార్ సర్టిఫికేట్ లభిస్తుందని అజ్ఞాత వాసి యూనిట్ ఆశిస్తూఉంది.

అదీ సంగతి.