5 పదాల్లో 2017ని చెప్పమంటే..?

2017 In 5 Words Twitter questioned users
Highlights

  • 5 పదాల్లో 2017ని వివరించమన్న ట్విట్టర్
  • ఫన్నీ సమాధానాలు ఇచ్చిన నెటిజన్లు

కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. అందరిలోనూ ఓ రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. గడిచిన సంవత్సరంలో జరిగిన మంచి, చెడులను కొందరు బేరీజు వేసుకుంటారు. మరికొందరు.. కొత్త సంవత్సరానికి రెజల్యూషన్లు పెట్టుకుంటారు. కాగా.. ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ దీనిపై సరదా సంభాషణకు తెర లేపింది. 2017వ సంవత్సరాన్ని కేవలం ఐదుపదాల్లో వర్ణించమంటే.. ఏమని వర్ణిస్తారని నెటిజన్లను  ప్రశ్నించింది. దీనికి 2017 ఇన్ 5 వర్డ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని పెట్టింది. దీనికి పలువురు నెటిజన్లు సరదాగా స్పందించారు. ఆ ట్వీట్లు ఏమిటో ఇప్పుడు చూద్దామా..

‘‘ యోగి, జీఎస్టీ, పద్మావతి, బిట్ కాయిన్, విరుష్క’’ ఓ వ్యక్తి 2017ని ఈ ఐదు పదాల్లో వివరించాడు. ఈ ఐదు పదాలు నిజంగానే ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. మరో వ్యక్తి ‘‘ ప్లీజ్ లింక్ యువర్ ఆధార్ కార్డ్’’ అని ట్వీట్ చేశారు. సేమ్ ఇదే ట్వీట్ ని చాలా మంది చేయడం గమనార్హం. మరొకరేమో ‘‘లింక్ యువర్ లైఫ్ విత్ ఆధార్ కార్డ్’’ అని ట్వీట్ చేశారు. మరికొందరు ‘‘విరాట్ అండ్ అనుష్క షాదీ’’ అని పేర్కొన్నారు. ఎక్కువ మంది విరాట్ అనుష్కల పెళ్లిని పేర్కొనడం విశేషం.

loader