ప్రతి సంవత్సరం.. మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదలౌతుంటాయి. వాటిలో కొన్ని పాపులర్ గా నిలిస్తే.. మరి కొన్ని అడ్రస్ లేకుండా పోతాయి. అలా ఈ ఏడాది మార్కెట్ లోకి వచ్చి.. ప్రజల మనసులను కొల్లగొట్టిన స్మార్ట్ ఫోన్ లు ఏమిటో చూద్దాం.. సాధారణంగా టాప్ లో ఐఫోన్, సామ్ సంగ్, వన్ ప్లస్ లాంటి ఫోన్లే ఉంటాయి. కానీ బడ్జెట్ విషయంలో వాటి ధరలు చాలా ఎక్కువ. అవి కాకుండా.. అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ధరలో మార్కెట్ లోకి వచ్చిన ఫోన్ల సంగతి చూద్దాం..

1.ఇన్ఫినిక్స్ జీరో5ప్రో

రూ.20వేల లోపు ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫ్షన్. దీని ధర రూ.19,999. దీని ఫీచర్లన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కెమేరా. ఫోటో క్వాలిటీ చాలా బాగుంది. ఫోన్ పనితీరు కూడా బాగుంది.

2. లెనోవో కే8 ప్లస్

బడ్జెట్ ధరలో లభించే మరో ఫోన్ ఇది. దీనిలో డ్యూయల్ కెమేరా ఆప్షన్ ఉంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది.

3. షియోమి ఎంఐ ఏ1

ఇది ఆండ్రాయిడ్ వర్షన్. చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కి  ప్రైస్ కట్ కూడా విధించింది.

4.లెనోవో కే8 నోట్

లెనోవో నుంచి వచ్చిన బెస్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. సాఫ్ట్ వేర్, డిజైన్, డిస్ ప్లేలో మంచి మార్కులు కొట్టేసింది.

5.మోటోరోలా మోటో జీ5ఎస్ ప్లస్

మోటో జీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ఫోన్ ఇది. దీని ధర రూ.15000. ఈ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ఫర్మానెన్స్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి.

6. సామ్ సంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్

సామ్ సంగ్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్ ఇది. ఇందులో ఫేస్ రికగ్నైజేషన్ అన్ లాక్ సిస్టమ్ సదుపాయం కూడా ఉంది.

7.కూల్ పాడ్ కూల్ ప్లే 6

8. ఒప్పో ఎఫ్3 ప్లస్

9. మోటోరోలా మోటో జీ5ప్లస్

10.జెడ్ టీఈ నుబియా జెడ్ 11మిని ఎస్

ఈ ఫోన్ల ధరలన్నీ..రూ.10వేల నుంచి రూ.20వేల లోపు మాత్రమే.