నిజాం కాలాజీలో చాలా మంది ప్రముఖులు విద్యను అభ్యసించారు అందరినీ ఆకట్టుకునే సాలార్జంగ్ హాల్
నిజాం కళాశాలకు చాలా గొప్ప చరిత్రే ఉంది. ఆ కళాశాలలో విద్యను అభ్యసించి.. ఉన్నత స్థాయికి ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. సినీ, రాజకీయ రంగాలలో రాణిస్తూ ప్రజల మెప్పు పొందుతున్న వారు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశానికి సేవ చేసిన వారు.. క్రీడా రంగం, సాహిత్య రంగానికి చెందిన వారు కా ఉన్నారు.ఆ ప్రముఖులు ఎవరో.. వారు ఏ రంగంలో ప్రగతి సాధించారో..నిజాం కాలేజ్ గొప్పతనం గురించి తెలుసుకుందామా..
సాలార్జంగ్ హాల్
నిజాం కాలేజ్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది సాలార్జంగ్ హాల్. ఇది అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ మధ్యలో ఉండే ఈ హాలులో సెమినార్లు, కల్చరల్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అప్పుడప్పుడు వివిధ పోటీ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ హాల్ నిర్మించి చాలా కాలం గడిచినా.. ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈ హాలు దగ్గరలోనే మరో హాలు కూడా ఉంటుంది. అందులో కళాశాలలో పని చేసిన అందరు ప్రిన్సిపల్స్ ఫోటోలు పెట్టి ఉంటాయి. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఎంటంటే.. మెట్లన్నీ చెక్కతో తయారుచేసి ఉంటాయి.
ఆకట్టుకుంటున్న క్లాస్‌రూమ్స్
క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి. పార్లమెంట్ లో మాదిరిగా బెంచీలు ఉంటాయి. దీంతో ఎంతో సౌకర్య వంతంగా ఉంటుందని కాలేజీ విద్యార్థులు చెబుతుంటారు. ఏదేమైనా నిజాం కళాశాల.. మనకు ఎందరో ప్రముఖులను అందజేస్తోంది. మన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతోంది.
కళాశాలలో చదివిన ప్రముఖులు వీరే..
కెఎం ఖుస్రో (ప్రముఖ ఆర్థికవేత్త ), రాకేష్‌శర్మ (అస్ట్రోనాట్), శ్యాంబెనగల్ (ప్రముఖ దర్శకుడు), అజారుద్దీన్(క్రికెటర్) మాజీ సీఎం నల్లారి కిరణ్‌కు మార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, సినీన టుడు నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్, టి.సుబ్బరామిరెడ్డి(రాజ్యసభ సభ్యుడు), అబ్బూరి ఛాయాదేవి(ప్రముఖ కథా రచయిత్రి,) బూర్గుల రామకృష్ణారావు( హైదరాబాద్ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి,), సీతారం ఏచూరి-పార్లమెంట్ సభ్యుడు, సీపీఐ(ఎం) నాయకుడు, ప్రస్తుత తెలంగాణ మంత్రి కేటీఆర్ , తదితరులు ఈ కళాశాలలోనే విద్యను అభ్యసించారు. ఈ కాలేజీకి పూర్వ విద్యార్థుల సంఘం కూడా ఉంది. వారంతా సమయం కుదిరినప్పుడు కలుస్తూనే ఉంటారు.
