రికార్డు సృష్టించిన వాట్సాప్.. ఎందులోనో తెలుసా?

20 billion messages sent on New Years Eve in WhatsApp
Highlights

  • వాట్సాప్ వచ్చాక.. ఎస్ఎంఎస్ ల కాలం చెల్లిపోయిందనే చెప్పవచ్చు.
  • అంతకముందు ఏవరికైనా ఏదైనా మెసేజ్ చెప్పాలంటే ఎస్ఎంఎస్ లు చేసేవారు.
  • ఇప్పుడు మెసేజ్ చేయాలన్నా.. ఫోటోలు పంపాలన్నా.. న్యూ ఇయర్ విషెస్ చెప్పాలన్నా.. అన్నింటికీ వాట్సాప్ వాడుతున్నారు.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వాళ్లు ఉండరు. అతి తక్కువ కాలంలోనే అందరికీ చేరువయ్యింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా చేరువైంది. వాట్సాప్ వచ్చాక.. ఎస్ఎంఎస్ ల కాలం చెల్లిపోయిందనే చెప్పవచ్చు. అంతకముందు ఏవరికైనా ఏదైనా మెసేజ్ చెప్పాలంటే ఎస్ఎంఎస్ లు చేసేవారు. ఇప్పుడు మెసేజ్ చేయాలన్నా.. ఫోటోలు పంపాలన్నా.. న్యూ ఇయర్ విషెస్ చెప్పాలన్నా.. అన్నింటికీ వాట్సాప్ వాడుతున్నారు. అందుకే న్యూ ఇయర్ లో వాట్సాప్ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇంతకీ ఎందులోనో తెలుసా..? కేవలం న్యూ ఇయర్ రోజున అంటే.. డిసెంబర్ 31 రాత్రి 12గంటల నుంచి జనవరి 1వ తేదీ రాత్రి 11గంటల 59 నిమిషాల వరకు ఎన్ని మెసేజులు పంపారో తెలుసా..? 20 బిలియన్లు  అంటే సుమారు 2వేల కోట్ల మెసేజ్ లు సెండ్ చేశారు. వాట్సాప్ వినియోగంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం 24గంటల్లో ఇన్ని మేసేజ్ లు పంపించుకోవడం ఇదే తొలిసారి. ఈ మెసేజీలన్నీ కేవలం ఇండియన్ యూజర్స్ మాత్రమే చేయడం విశేషం. 

వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 2017లో విడుదల చేసిన స్టేటస్, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ లాంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయని వాట్సాప్ తెలిపింది. కేవలం భారత్ లో నెలకి 200మిలియన్ల మంది యాక్టివ్ వాట్సాప్ యూజర్స్ ఉన్నట్లు తెలిపింది.

loader