ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య శాఖకు చెందిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పాండురంగారావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడి చేసిన తనిఖీలు చేస్తున్న అ.ని.శా. అధికారులు.విశాఖ, విజయవాడ, గుంటూరు, ప.గో., హైదరాబాద్‌లోని 12 చోట్ల పెద్ద ఎత్తున సోదాాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య శాఖకు చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడి చేసిన తనిఖీలు చేస్తున్న అ.ని.శా. అధికారులు
విశాఖ, విజయవాడ, గుంటూరు, ప.గో., హైదరాబాద్లోని 12 చోట్ల పెద్ద ఎత్తున సోదాాలు జరగుతున్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని నవోదయ కాలనీలో పాండు రంగారావు ఇంట్లో భారీగా ఆభరణాల గుర్తించారు
భారీ సంఖ్యలో బంగారు నాణేలు, బిస్కెట్లు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు కనిపించాయి
గుర్తించిన వాటిలో 2కిలోల పైగా బంగారు ఆభరణాలు, 10 కేజీల పైగా వెండి ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు దొరికాయి.
పాండురంగారావు సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు.
పట్టుబడిన ఆస్తుల విలువను మధింపు వేస్తున్నామని అ. ని. శా డీఎస్పీ రమాదేవి తెలిపారు.
