ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 17మంది సజీవదహనం

17 Dead In Delhi Warehouse Fire 5 Jumped From Terrace
Highlights

  • ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
  • 17మంది సజీవదహనం
  • 30మందికి గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం బావన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న రెండస్తుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఐదుగురు భవనంపై నుంచి కిందకు దూకారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 20 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి. భవనంలోపల చాలా మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. భవనం మొదటి అంతస్తులో టపాసుల కర్మాగారం, రెండో అంతస్తులో రబ్బర్ ఫ్యాక్టరీ ఉంది. టపాసుల కర్మాగారంలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు మంటలు వ్యాపించాయని, దీంతో మొదటి అంతస్తులో 13 మంది, గ్రౌండ్ ఫ్లోర్‌లో ముగ్గురు, భవనం బేస్మెంట్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనలో 30మంది తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల కుటుంబీకులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

 

loader