అక్కడ రోడ్డు మీద తలకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. 90ల కాలం నాటి పాట వింటూ డాన్స్ చేశాడు అతను చేసిన పని అక్కడి అధికారులకు నచ్చలేదు.
ఓ బాలుడు.. రాత్రికి రాత్రే.. ఫేమస్ అవ్వాలనుకున్నాడు.... అనుకున్నదే తడవుగా డ్యాన్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సీన్ కట్ చేస్తే.. అధికారులు అతనిని అరెస్టు చేసి జైలు లో వేశారు. వివరాల్లోకి వెళితే..
సౌదీ అరేబియాకు చెందిన ఓ 14ఏళ్ల బాలుడు ఉన్నపలంగా పాపులారిటీ తెచ్చుకోవాలనుకున్నాడు. అంతే బాగా రద్దీగా ఉండే
ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ రోడ్డు మీద తలకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. 90ల కాలం నాటి పాట వింటూ డాన్స్ చేశాడు. దానంతటినీ అహ్మద్ అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
అతను పోస్టు చేసిన వెంటనే 4వేల మందికి పైగా అతని ట్వీట్ ని రీట్వీట్ చేయగా.. 6వేలకు పైగా లైక్ చేశారు. అతను కావాలనుకున్న పాపులారిటీ వచ్చేసింది. ఫేమస్ అయిపోయాడు. కానీ.. అతను చేసిన పని అక్కడి అధికారులకు నచ్చలేదు. రోడ్డుపై డ్యాన్స్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశాడని.. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అతనిని అరెస్టు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. నెటిజన్లు మాత్రం.. అతని డ్యాన్స్ కి ఫిదా అయ్యారు. మెచ్చుకుంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా.. తర్వాత పోలీసులు ఆ బాలుడిని వదిలిపెట్టారు.
