తండ్రి పెట్టే హింసలు భరించలేక బిల్డింగ్ పై నుండి దూకేసిన బాలిక (వీడియో)

తండ్రి పెట్టే హింసలు భరించలేక బిల్డింగ్ పై నుండి దూకేసిన బాలిక (వీడియో)

పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు కసాయి మనుషుల్లా మారితే. రాజస్థాన్ తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ 12 సంవత్సరాల బాలిక టెర్రెస్ పై నుంచి దూకేసింది. వందన అనే బాలికను భవంతిపైకి తీసుకెళ్లిన ఆమె తండ్రి పదే పదే కొడుతూ ఉంటే, ఆ బాధ నుంచి భరించలేక టెర్రెస్ పై నుంచి ఆమె దూకేసింది. 

ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం ఘటననూ ఎవరో వీడియో తీసి అందించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్ ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

                                          

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos