జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రశ్నించడానికి వస్తానంటే... ఇక పర్వాలేదు, మనొకొకతోడున్నాడని రాష్ట్రంలోని రకరకాలా బాధితుల సంబరపడ్డారు.తమకు కొండంత అండ దొరికిందనుకున్నారు. ఈ మూడున్నరేళ్ల పరిపాలన  చూసి కడపు మండి ఇపుడు ప్రశ్నించడానికి వస్తానన్నపుడు ఆయన ఎన్ని ప్రశ్నల బాణాలు సంధిస్తారో అని అనుకున్నారు. ఇక భూకంపం అనుకున్నారు. ఆయన విశాఖ వెళ్లారు, పవన్ బాణం వేస్తారునుకున్నారు.  పోలవరం వెళ్లారు, అక్కడి నుంచి మిసైల్స్ ప్రయోగిస్తారనుకున్నారు., విజయవాడ వచ్చారు, రాజధాని నుంచే దాడి మొదలవుతుందని ఆశించారు. ఇపుడు ఒంగోలులో ఉన్నారు, ప్రశ్నలెక్కడ?   అనేక ఉపన్యాసాలిచ్చారు. సాంఘిక నీతిబోధ చేశారు. ఆవేదన చెందారు. హతాశుడయ్యారు. ఎటొచ్చి ప్రశ్నలే లేవు. అంతా అవాక్కయ్యారు. ఎమిటిది? ప్రశ్నలెక్కడ? అందువల్ల నెటిజన్లు ఆయనకు 15 ప్రశ్నలు వేస్తున్నారు.

పవర్ స్టార్ పవనన్నకు 12 ప్రశ్నలు...

 • గోదావరి పుష్కరాలలో 30 మంది తొక్కిసలాట వలన చనిపోతే వెళ్లలేదు. ఎందుకు? చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా 30 మందిని లారీతో తొక్కించి చంపించి నపుడు పవనన్న ఎందుకు చలించలేదు? దీని మీద వేసిన కమిషన్ ఏమయింది? నివేదిక ఎక్కడ?

 • మొన్నటిదాకా  నాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కారు emi కట్టలేక అమ్మేశాను అన్నారు... sudden గా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆఫీసు కట్టడానికి డబ్బు వచ్చేసింది?
 • మీ సిఫార్స్ లేకుండానే టిటిడి లో డా.హరిప్రసాద్  మెంబరయ్యారా? ఆయన దర్శనం టిక్కెట్లు అమ్మలేదా? ఈ విషయం మీద విచారణ కోరే ధైర్యం ఉందా?
 • డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియను ప్రైవేట్ పరం ఎలా చేస్తారని అడుగుతున్నారు. బాగుంది. మరి మీరు దగ్గర ఉండి ప్రచారం చేసి గెలిపించిన గన్నవరం ఎమ్మెల్యే  వంశీ గత 3 నెలలుగా హనుమాన్ జంక్షన్ చెక్కర ఫాక్టరీ గురించి చేస్తున్న పోరాటం కనపడటం లేదా ?  

 

 • మొన్నా మధ్య నేను మా అన్నని ఎదిరించి బయటకి వచ్చాను అన్నారు. మరుసటి రోజు మా అన్నని మోసం చేసిన  వారిని వదిలిపెట్టను అంటున్నారు. (ఈ మధ్య లో మనల్ని బాధ పెట్టిన వారి మీద కసితీర్చుకోవాలన్న ధోరణి మంచిదికాదని కూడా అన్నారు.). ఈ పల్టీలకు అర్థమేమిటి?
 • వారసులు రాజకీయాలలో ప్రూవ్ చేసుకోవాలి అని సెలవిచ్చారు.మరి లోకేశ్ ఏమి ప్రూవ్ చేసుకుని మంత్రి అయ్యారో చెప్పాలి.
 • ఇదే పవన్ గారు 2009 ఎన్నికలలో చిరంజీవి గారు ఏమి ప్రూవ్  చేసుకున్నారు అని పార్టీ పెట్టారు ? ఆ పార్టీలో యువజన అధ్యక్షుడిగా మీరే ఏమి ప్రూవ్  చేసుకుని  వచ్చారు?
 • గత 3 ఏళ్లగా చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదా?
 • చైతన్య-నారాయణ కళాశాలల్లో విద్యార్ధుల ఆత్మ హత్యల పైన కనీస స్పందన కూడా చూపలేదు. ఎందుకు? యాజమాన్యాలను పల్లెత్తు మాట కూడ అనలేదు, ఎందుకు?
 • మరి 4 ఏళ్లగా ఈ రాష్ట్రంలో ఫీ రిఎంబర్స్ మెంటు గురించి ప్రశ్నించాలనిపించనేలేదా? ఇడుపులపాయ ట్రిపుల్ ఐఐటి గ్రామీణ విద్యార్ధులకు గత 3 ఏళ్లగా కనీసం ఒక్క లాప్ కూడా ఇవ్వలేదు, ఎందుకు అని ప్రశ్నంచలేదేందెకు?  

 

 • పోలవరం నిర్మాణం లోని అవినీతి, కాపులకు రిజర్వేషన్ల పేరుతో బాబు గారు చేస్తున్న రాజకీయం పైన మీకు ప్రశ్నలే లేవా?
 • చివరిగా... ఎక్కడో లండన్లో  ఒక తెలుగు విద్యార్ధి వేసిన ప్రశ్న మిమ్మల్ని ఆలోచనలో పడేసింది అన్నారు. జ్ఞానోదయం గలిగించిందన్నారు. మీరు 2016 జనవరిలో తూళ్ళూరు వచ్చినప్పుడు అక్కడ రైతులు వేసిన ప్రశ్న మిమ్మల్ని ఆలోచనలో పడెయ్యలేదా? ఆ ప్రశ్నల్ని మర్చిపోయారా?