Asianet News TeluguAsianet News Telugu

ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు..

  • ఈ నెల 9,11, 13 తేదీలలో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
  • లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా నడిచే మరి కొన్ని లోకల్ రైళ్లను సికింద్రాబాద్‌ వరకే పరిమితం చేస్తున్నారు
12 MMTS DEMU trains cancelled 2 rescheduled hyderabad

 

హైదరాబాద్ నగరంలో మెట్రోపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మెట్రోపనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 9,11, 13 తేదీలలో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటా వంతెన మీద నుంచి మెట్రో స్టీల్‌ బ్రిడ్జిని  ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీసులను పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా నడిచే మరి కొన్ని లోకల్ రైళ్లను సికింద్రాబాద్‌ వరకే పరిమితం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఫలక్‌నుమా నడిచే రైళ్లను కొన్నిటిని రద్దు చేశారు.

సికింద్రాబాద్‌- మేడ్చల్‌ సర్వీసును కూడా పూర్తిగా రద్దు చేశారు. ఉందానగర్‌ -సికింద్రాబాద్‌ డెమూ రైలును నేడు రద్దు చేశారు. నేడు సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ఫలక్‌నుమా వెళ్లే ఎంఎంటీఎస్‌ రైలును సాయంత్రం అరగంట ఆలస్యంగా నడుపుతున్నారు. మనోహరాబాద్‌- సికింద్రాబాద్‌ మధ్య నడిచే డెమూ

సర్వీసును పాక్షికంగా రద్దుచేశారు.

11, 13 తేదీల్లో 47204, 47168 నంబర్లతో నడిచే ఫలక్‌నుమా - సికింద్రాబాద్‌ల మధ్య నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మనోహరాబాద్‌ -సికింద్రాబాద్‌; సికింద్రాబాద్‌ - ఉందానగర్‌; ఉందానగర్‌ -సికింద్రాబాద్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ నెల 13 ఉందానగర్‌ - సికింద్రాబాద్‌; సికింద్రాబాద్‌- మేడ్చల్‌; మనోహరాబాద్‌- సికింద్రాబాద్‌; సికింద్రాబాద్‌ - ఉందానగర్‌ సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. హజ్రత్‌ నిజాముద్దీన్‌- హైదరాబాద్‌ దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 9న, 13న కాజీపేట - సికింద్రాబాద్‌ స్టేషన్లలో కాని.. మధ్యలో అయినా 50 నిమిషాలు నిలిపి వేయనున్నారు.మచిలీపట్నం- సికింద్రాబాద్‌ మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను కూడా 30 నిమిషాలపాటు నిలిపివేయనున్నారు. ఈ నెల 13న యశ్వంతాపుర్‌ - శ్రీమాతా వైష్ణోదేవి కత్రా ఎక్స్‌ప్రెస్‌ను సులేహల్లి, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో ఎక్కడో ఒకదగ్గర 50 నిమిషాల పాటు నిలిపివేయనున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios