Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ కుర్చీలో 11ఏళ్ల బాలుడు.. ఫోటోలు వైరల్

  • కిరణ్ బేడీ కార్యాలయానికి వెళ్లిన ఓ కుటుంబం
  • ఆప్యాయంగా పలకరించిన కిరణ్ బేడీ
  • లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డ బాలుడు
11 year old boy sits in LG Kiran Bedis chair during Raj Nivas visit

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ బాలుడి మనసు గెలుచుకున్నారు. 11 ఏళ్ల కుర్రాడిని తన కుర్చీలో కూర్చొపెట్టిమరి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పుదుచ్చేరి రాజ్ భవన్  సందర్శనార్థం ఓ 11ఏళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చాడు. అయితే, ఆ సమయంలో కిరణ్ బేడీ తన కార్యాలయంలో ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బాలుడి కుటుంబం అక్కడికి వెళ్లారు. బాలుడి కుటుంబసభ్యులతో ప్రేమగా మాట్లాడిన కిరణ్ బేడీ, ఆ బాలుడిని ఆప్యాయంగా పలకరించారు.

అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఉబ్బితబ్బిబ్బయిన ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ‘సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతాను. దీని ద్వారా వాళ్లు స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’ అని  అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios