ఈ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో ని  కాలాపత్తర్ వద్ద  సిఆర్ పిఎస్ జవాన్ల మీద నక్సల్స్ దాడి చేశారు.

ఛత్తీష్ గడ్ సుక్మా జిల్లాలో జరిగిన నక్సల్ కు సిఆర్ పిఎఫ్ జవాన్ల కు మధ్య జరగిని ఎన్ కౌంటర్ లో దాదాపు 24 మంది చనిపోయారు. ఈ దాడిలో మరొక 7 మంది గాయపడ్డారు.

కొన్ని రిపోర్టుల ప్రకారం చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దాదాపు 26 మంది దాకా చనిపోయారని ఛత్తీష్ గడ్ పోలీసులు చెబుతున్నారు. ఖచ్చితంగా సంఖ్య తెలియడం లేదు. 12 నక్సల్స్ కూడా చనిపోయారని భోగట్టా.

ఈ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో ని కాలాపత్తర్ సిఆర్ పిఎస్ జవాన్ల మీద నక్సల్స్ దాడి చేశారు, ఫలితంగా భీకరమయిన ఎన్ కౌంటర్ జరిగింది.

దాడిలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నట్లు, కనీసం మూడొందల మంది దాకా వుంటారని తెలుస్తున్నది.

‘ మేం 11 మంది జవాన్లను కోల్పోయాం. వాళ్లంతా అక్కడ ఒక రోడ్ ప్రారంభం పనిలో ఉన్నపుడు నక్సల్స్ దాడి చేశారు. నక్సల్స్ జరిపిన కాల్పులలో మరొక ఏడు మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ చిక్కుకున్నవాళ్లందరిని సురక్షితంగా హెలికాప్టర్ల ద్వారా బయటకు తెచ్చే పనిలో ఉన్నాం,’ అని సిఆర్ పిఎఫ్ అధికారి ఒకరు చెప్పారు.

ఈ మధ్యనే ఆ ప్రాంతంలో వేసిన ఒక రోడ్డు సురక్షితం చేసే పనిలో వారంతా ఉన్నారు. ఈ జవాన్లంతా మావోయిస్టుల ఏరివేతలో ఉన్న సిఆర్ పిఎఫ్ 74 బెటాలియన్ కు చెందిన వారు.

ఈ ప్రాంతానికి అదనపు బలగాలను పంపి కూంబింగ్ నిర్వహించబోతున్నారు. గాయపడిన వారిని రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించారు.

మార్చి 12 జరిగిన సంఘటనలో కూడా 12 మంది జవాన్లు హతమయ్యారు.