ఉత్తరప్రదేశ్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను కారణంగా 11మంది మృతి చెందగా.. మరో 11 మందికి పైగా మృతి చెందారు. కేవలం బుధవారం సాయంత్రం వచ్చిన తుఫాను కారణంగానే వీరంతా మరణించడం గమనార్హం.

ఎత్వా, మధుర, అలిగర్, ఫిరోజాబాద్ ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్ లో ఓ వ్యక్తి పిడుగుపాటుకి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆగ్రాలో ఓ వ్యక్తి చెట్టు కూలి పడటంతో మృతిచెందాడు.

గత వారం రోజులుగా ఉత్తరప్రదేశ్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తూనే ఉంది.గతంలో ఈ తుఫాను కారణంగా 64మంది మృతిచెందగా.. మరో 160మంది గాయపడ్డారు. కాగా.. తాజాగా మరో 11మంది మృతిచెందారు. పక్క రాష్ట్రమైన రాజస్థాన్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పరిస్థితిని సమీక్షిస్తున్నారు.