Asianet News TeluguAsianet News Telugu

2 జి స్కాం: అబ్బుర పరిచే 11 వాస్తవాలు

గతంలో దయానిధి మారన్ ని నిర్దోషిగా ప్రకటించిన జడ్జి సేనీయే ఇపుడు రాజా, కణిమోళి కూడా నిర్దోషి అని ప్రకటించారు.

11 interesting facts about 2g spectrum case  A Raja and  Kanimozhi

1. ఈ ఉదయం పటియాల హౌస్ కోర్టు జనంతో క్రిక్కిరిసి పోయింది. 17 మంది నిందితులు కోర్టులోకి ప్రవేశించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత కోర్టు మొదలు కాగానే, క్షణాల్లోనే న్యాయమూర్తి ఒ పి సైనీ తీర్పు వెలువరించారు. తీర్పు కీలకభాగం చదువుతూ కేసులను నిరూపించడంలో ప్రాసెక్యూషన్ విఫలమయిందని, వారందరిని నిర్దోషులు ప్రకటించడంలో నేనేమాత్రం సంశయించను అని అన్నారు.

2. మాజీ క్యమూనికేషన్ల మంత్రి ఎ రాజా కళ్లెంబడి నీళ్లు కారాయి. ఈ విచారణలో తన కేసును తానే వాదించుకున్నారు. సాక్ష్యులను కూడా తానే విచారించారు. ఈ రోజు కుటుంబ సభ్యలతో కలసి ఆయన కోర్టు కు వచ్చారు. 2011లో ఆయన ఈ కేసులో అరెస్టు అయి దాదాపు ఏడాది జైలులో ఉన్నారు.

3. కరుణానిధి కూతురు, ఎంపి కణిమోళి, న్యాయం నెగ్గిందని వ్యాఖ్యానించారు. ఆమె కూడా ా ఆరు నెలల పాటు ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు.

4. 2జి స్ట్రెక్ట్రమ్ విక్రయాలలో భారీ అవినీతి జరిగిందని కాగ్ 2010 లో  చెప్పినతర్వాత 2011 లో విచారణ మొదలయింది. ఎలాంటి బిడ్డింగ్ లేకుండా 2జి లైసెన్స్ లను 2007-2008లో కారు చౌకగా అమ్మేశారని, దీనికోసం ముడుపులు తీసుకున్నారన్నది ఆరోపణ. రు. 1.76 లక్షల కోట్లు కుంభకోణమని కాగ్ చెప్పింది. సిబిఐ  మాత్రం 30,984 కోట్ల నష్టం అని పేర్కొంది

5. ఈ వ్యవహారంలో ఒక టెలికాం కంపెనీ  నాటి మంత్రి ఏ రాజాకు  200 కోట్లరుపాయల లంచం ఇచ్చిందని, దీనిని ఆయన చెన్నైలోని ఒక టివిచానెల్ లోఇన్వెస్టు చేశారన్నది సిబిఐ ఆరోపించింది. ఈ చానెల్  కణి మోళిదని కూడా సిబిపి ఆరోపించింది.

6. ఈ మొత్తం వ్యవహారంలో ’ ప్రభుత్వానికి నష్టమేమీ రాలేదు’ అన్న మా మాట రుజవుయిందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు.

 

7.గత నెలలో ప్రధాని మోదీ చెన్నై వెళ్లి డిఎంకె పెద్దాయన  కరుణానిధిని కలుసుకున్నారు. ఆ తర్వాత బిజెపి, డిఎంకె దగ్గరవుతాయని బోలెడు కథనాలు వినిపించాయి. ఏదో విధంగా బిజెపి తమిళనాడులో కాలుమోపాలని ప్రయత్నిస్తూ ఉంది. దీనికోసం రెండు ద్రవిడ పార్టీలతో కూడా మంతనాలాడుతూ ఉంది.  మోదీ- కరుణానిధి సమావేశం జరిగిన నెలరోజుల్లోనే తీర్పు వచ్చింది.

8.  ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యుపిఎ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కుదిపేసిన పెద్ద స్కాం ఇదే.

 

9.రాజా కంటే ముందు టెలికాం మినిస్టర్ గా ఉన్న దయానిధి మారన్ ను కూడ నిర్దోషిగా ప్రకటించిన జడ్జి కూడా ఈయనే. మారన్ ఎయిర్ సెల్  కంపెనీని ఒక మలేషియా కంపెనీకి అమ్మేందుకు వత్తిడి తెచ్చారని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ ఆరోపణ. ఫలితంగా ఆయన మీడియా బిజినెస్ లోకి బారీ పెట్టుబడులు వచ్చాయని సిబిఐ ఆరోపించింది.

10.  రు. 1.76 లక్షల కోట్ల ఆరోపణ లు రాాగానే మంత్రిగా ఎ రాజా జారీ చేసి 2 జి లైసెన్స్ లను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

11. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లతో ఈ వ్యవహారంపై యూపీఏ టర్మ్ లోనే సీబీఐ విచారణ మొదలైంది.  ఇపుడు స్వామి ఏమంటారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios