రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు సుమారు వెయ్యి విమానాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి రోజూ గంటా 45 నిమిషాల పాటు ఏ విమానాలు వెల్లడానికి వీలు లేదని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని అన్ని విమానయాన సంస్థలకు తెలియజేశాయి. ఉదయం 10గంటల 30 నిమిషాల  నుంచి మధ్యాహ్నం 12గంటల 15 నిమిషాల వరకు 9 రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపేశారు. దీంతో.. ఆ సమయంలో ప్రతిరోజూ ప్రయాణించాల్సిన విమానాలను రద్దు చేశారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సమయంలో విమానాలను రీషెడ్యూల్‌ చేస్తారు కానీ, ఈ ఏడాది మాత్రం విమాన సర్వీసులను రద్దు చేశారు. ఏటా రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఆరు రోజులు మాత్రమే ఇలా విమాన సేవలకు అంతరాయం ఏర్పడేది. కానీ ఈ ఏడాది దాన్ని తొమ్మిది రోజులకు పెంచారు.  దీనిని రిపబ్లిక్‌ డే క్లోజర్‌ పీరియడ్‌ అని పిలుస్తారు.