Asianet News TeluguAsianet News Telugu

స్నేహితులకు అప్పు ఇస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..

  • స్నేహితుడి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి
  • మీ అవసరాన్నీ తెలియజేయాలి
  • చివరి  ప్రయత్నంగా కోర్టుకు వెళ్లొచ్చు.
10 things to know before lending money to your friends

పెద్దగా స్నేహ బంధం లేని వారికి అప్పు ఇవ్వడం సులభం. ఎందుకంటే వారు చెప్పిన సమయానికి అప్పు చెల్లించకపోయినా.. సరిగా వడ్డీ చెల్లించకపోయినా గట్టిగా అడగగలం. వాళ్లు ఏమనుకుంటారో.. వాళ్లతో మన బంధం ఏమౌతుందో అని భయపడాల్సిన పని ఉండదు. కానీ అదే అప్పు స్నేహితులకు ఇవ్వాల్సి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఒక వేళ అప్పు ఇచ్చాక తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే.. అనవసర మనస్పర్థలు ఎదురౌతాయి. అదే అసలు అప్పు ఇవ్వకుండా ఉందామా అంటే.. మనీ దగ్గర ఉండి కూడా ఇవ్వలేదని వాళ్లు భాధపడతారు. ఈ రెండింటిలో ఏది జరిగినా.. స్నేహ బంధానికి ఆటంకం ఏర్పడుతుంది. మరి ఇలాంటి  సందర్భం ఎదురైనప్పుడు ఏమి చెయ్యాలి..? అప్పు ఇవ్వాలా వద్దా.. ? వీటన్నింటికి సమాధానం కావాలా.. ఈ పది పాయింట్లు మీరు మీ మైండ్ లో పెట్టుకుంటే  మీకా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

*మీ స్నేహితుడు మిమ్మల్ని కొంత డబ్బు అప్పుగా అడిగాడు. కాదనలేక మీరు కూడా ఇచ్చారు. ఆ డబ్బు తీసుకునే టప్పుడు మీ ఫ్రెండ్ కొంత కాలానికి ఇస్తానని మీకు మాట ఇచ్చాడు. కానీ.. చెప్పిన సమయానికి ఆ డబ్సు ఇవ్వలేకపోయారు. తాను మీ వద్ద రుణం తీసుకునే సమయానికి మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయలేరు. కాబట్టి ఆలస్యమైనా పర్వాలేదని భావిస్తారు. అలా కాకుండా ముందుగానే మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేయాలి.

* లీగల్ అగ్రిమెంట్ లేకుండా రుణం ఇచ్చినట్లయితే.. డబ్బు సకాలంలో తిరిగి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.

*అనుకున్న సమయానికి మీ స్నేహితుడు మీ డబ్బును తిరిగి ఇవ్వలేకపోతున్నాడు అంటే.. అతను మనీ ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నాడో లేదో మీరు తెలుసుకోవాలి. అతని  పరిస్ధితి సరిగా లేనట్లయితే.. వారికి ఇంకొంత సమయాన్ని ఇవ్వండి.

* మీ ఫ్రెండ్ ఇచ్చే పరిస్థితిలో లేడు.. కానీ మీకు ఆ డబ్బు చాలా అవసరం. అలాంటప్పుడు... వారికి మీ అవసరాన్ని కూడా తెలియజేయాలి. మీకు డబ్బు ఎంత అవసరమో తెలియజేస్తే.. వాళ్లు కూడా మీ అవసరాన్ని గుర్తించి త్వరితగతిన ఇచ్చే అవకాశం ఉంటుంది.

* మీ మిత్రుడు తనకు డబ్బు అవసరం చాలా ఉందని అందుకు మిమ్మల్ని సహాయం కోరితే.. అప్పు చెయ్యకుండా డబ్బు పొందే విధానాలను వారికి తెలియజేయాలి. పర్సనల్ లోన్, బంగారం పై రుణం, ప్రాపర్టీ లోన్ వంటి వాటి గురించి సలహా ఇవ్వాలి.

*రుణం ఇచ్చి చాలా కాలం అవుతున్నా కూడా.. ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వకపోతే.. మీ ఇద్దరి కి ఉండే కామన్ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో చెప్పి సమస్య పరిష్కరించుకోవచ్చు.

*నోటి మాట ద్వారా.. నమ్మకంతో అప్పు ఇచ్చే కంటే ప్రామిసరీ నోట్ తో ఇస్తే మంచిది. అందులో అప్పు ఇచ్చిన తేదీ, తిరిగి ఇస్తానన్న తేదీ, వడ్డీ తదితర విషయాలన్నీ  చేర్చాలి. అంతేకాకుండా ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటే మంచింది. ఏదైనా కారణం చేత అప్పు తిరిగిచ్చే సమయంలో మీరు లేకపోతే మీ కుటుంబ సభ్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

*చెక్ ద్వారాగానీ, ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ అప్పు ఇచ్చినట్లయితే.. ఆ రికార్డు మీ వద్ద ఉంటుంది.

*అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ మీ డబ్బు మీకు తిరిగి లభించకపోతే.. మీరు చట్ట ప్రకారం ప్రయత్నించవచ్చు.  అప్పుడు వారికి మీరు చేసిన మెసేజీలు, బ్యాంక్ సమాచారం, ప్రత్యక్ష సాక్షులు వంటివి ముందుగానే సిద్ధం చేసుకోవాలని అవి మీ కేసుకు అండగా నిలుస్తాయి.

*నయానో.. భయానో చెప్పి చూసినప్పటికీ ఫలితం లేకపోతే.. అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ.. అది కూడా తలకు మించిన భారమే. కోర్టుకు వెళితే.. మీరు మీ స్నేహితుడిని కోల్పోవడం మాత్రమే కాదు.. ఆ కేసు ప్రాసెస్ జరగాలంటే కూడా డబ్బు బాగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అపుడు మీ  అప్పు తీరేమాట అటుంచితే, మీరు మరింత ఆర్థిక భారం మోయాల్సి ఉంటుంది.

 అదిల్ షెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

 

Follow Us:
Download App:
  • android
  • ios