ఆ క్రికెటర్ కి ఎయిర్ పోర్టులో అవమానం

'Cheat, cheat': Steve Smith booed as he leaves South Africa
Highlights

నిన్నటి దాకా జైజైలు కొట్టిన అభిమానులే.. ఈ రోజు ఇలా చేశారు

బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన స్టీవ్ స్మిత్ కి ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎందురైంది. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు.. బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ ముగ్గురు ఆసిస్ క్రికెటర్లపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ముగ్గురు క్రికెటర్లపై ఏడాదిపాటు నిషేధం కూడా విధించారు.

 బాల్ ట్యాంపరింగ్ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఇటీవల విచారణ కూడా చేపట్టింది. ఈ విచారణ ముగియడంతో స్మిత్‌ దక్షిణాఫ్రికా నుంచి  స్మిత్ స్వదేశానికి బయలుదేరాడు. ఈ నేపథ్యంలో జొహానెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్మిత్‌ను అక్కడ అభిమానులు చూసి ‘చీట్‌..చీట్‌’ అంటూ హేళన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

మరోపక్క మీడియా కూడా స్మిత్‌ను మాట్లాడాల్సిందిగా కోరింది. దీంతో పోలీసుల సాయంతో స్మిత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాడో... వాటికి స్మిత్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

 

 

loader