Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కే సాధ్యం కాలేదు... జగన్ కు ఎలా సాధ్యమవుతుంది: సోమిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని మార్చాలన్న సీఎం జగన్ ప్రయత్నం ఫలించే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.   

somireddy chandramohan reddy compairs kcr, jagan decisions
Author
Nellore, First Published Jan 7, 2020, 6:22 PM IST

అమరావతి: మాచవరం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై జరిగిన దాడిపై టిడిపి నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే  గన్ మెన్లు రైతులపై దౌర్జన్యం చేయడంతో ఆగ్రహించిన ప్రజలు ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని రైతులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని సోమిరెడ్డి  తెలిపారు.

అసలు వైసిపి ఎమ్మెల్మే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్కడకు ఎందుకెళ్లారు..? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. అంతకుముందు మంత్రి ఆదిమూలపు సురేష్ వస్తే రైతులంతా బతిమాలితే వెనక్కి వెళ్లారని తెలిపారరు. కానీ పిన్నెల్లి మాత్రం ముందుకెళ్లడానికి  ప్రయత్నించడమే కాదు దౌర్జన్యానికి పాల్పడటంతో ఈ దాడి జరిగినట్లు సోమిరెడ్డి తెలిపారు.

రైతులను కొట్టి మళ్లీ రైతులపైనే కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని సమస్య సృష్టించింది వైసిపినే అని... పరిష్కరించాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నరు. 151సీట్లు ఇచ్చి పాలించమంటే అది చేతగాక ఉన్నదాన్ని చెడగొట్టారని అన్నారు. 

కేవలం ఐదు రోజుల్లోనే బోస్టన్ కమిటి మూడు రాజధానులు చేయమని రిపోర్ట్ ఇవ్వడాన్ని సోమిరెడ్డి తప్పుబట్టారు. ఈ ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ను లాఫింగ్ స్టాక్ గా తయారుచేసి నవ్వులపాలు చేశారన్నారు. టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రానికి ఎన్నో అవార్డులు తెచ్చి ఖ్యాతిని పెంచితే వీళ్లు ఈ విధంగా నవ్వులపాలు చేయడం బాధాకరమన్నారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాజధానిని మార్చలేరని అన్నారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అన్ని జిల్లాలు, అన్నివర్గాల ప్రజలు పోరాటం చేస్తాయన్నారు. 

read more ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి చంద్రబాబు కుట్రే... ఆధారాలివే: డిప్యూటీ సీఎం

హైదరాబాద్ లో కేవలం సెక్రటేరియట్ ను మార్చడానికే హైకోర్ట్ అంగీకరించలేదని... రూ.400కోట్లతో నిర్మిస్తామని కెసిఆర్ డిజైన్లు చూపించినా ఒప్పుకోలేదని గుర్తుచేశారు. చెస్ట్ హాస్పిటల్ సైట్ చూశారు, ఎర్రగడ్డలో 60ఎకరాలు అన్నారు, బైసన్ గ్రౌండ్స్ అన్నారు దేనికీ కోర్టు అంగీకరించలేదని తెలిపారు. పాతభవనాలు కూలగొట్టి కొత్తవి కడ్తామంటే ఒప్పుకోలేదు... ఒకవైపు అప్పులు చేస్తూ మరోవైపు దుబారా ఖర్చులేంటని ప్రశ్నించిందన్నారు. అలాంటిది గెజిట్ విడుదల చేసి 4ఏళ్లుగా అమరావతిలో సక్రమంగా అన్నీ నడుస్తోంటే దానిని ఇప్పుడు మరోచోటకు తరలిస్తామంటే కేంద్రం, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవన్నారు.

'' మూడు కోర్టులు మూడు రాజధానులు అంటావు నీకేమైంది జగన్మోహన్ రెడ్డీ. 13జిల్లాలకు 3హైకోర్టులు పెడ్తావా..? అంటే 4జిల్లాలకు ఒక కోర్టు పెడతావా..? దేశంలో 732జిల్లాలకు  25హైకోర్టులు 15బెంచ్ లు ఉన్నాయి. 19జిల్లాలకు ఒక హైకోర్టు, బెంచ్ ఉంది.  నీలా ఆలోచిస్తే దేశంలో 175హైకోర్టులు పెట్టాలి'' అంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. 

''హైకోర్టు కర్నూలుకు నువ్వు తెచ్చేదిలేదు  చచ్చేదిలేదనే అక్కడి ప్రజలు గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు. అమరావతిలో భారత ప్రభుత్వ సంస్థలు 25 సంస్థలకు 192ఎకరాలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు 24కు 165ఎకరాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వ పిఎస్‌యూలు 18 యూనిట్లకు 23ఎకరాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పిఎస్‌యూలు 4 యూనిట్లకు 11.27ఎకరాలు ఇచ్చాం. ఆలిండియా సర్వీసెస్ అధికారులు 372మందికి 38.43ఎకరాలు ఇచ్చాం. 16మంది జడ్జిలు, రిజిస్ట్రార్లకు 2ఎకరాలు ఇచ్చాం. 130పైగా సంస్థలకు రాజధానిలో భూములు  కేటాయించాం. వీటన్నింటినీ ఏట్లో కలిపేస్తారా..?'' అని ప్రశ్నించారు. 

''నాబార్డు, ఆర్బీఐ, ఎస్బిఐ,ఎయిమ్స్ అన్నీ ఎత్తేస్తారా..? మొత్తం పూడ్చేస్తారా..?రాజధాని మార్పుపై కారణం ఇది అని చెప్పడానికి ఒక్క అంశం లేదు. మీకు దమ్ముంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ పై యాక్షన్ తీసుకోండి.మీ బోస్టన్ గ్రూప్, జిఎన్ రావు ఏం స్టడీ చేశారో గాని సామాన్యుడు కూడా చెప్పగలడు ఈ ప్రభుత్వం వీటి తరలింపు సాధ్యం కాదని'' అని అన్నారు. 

read more  రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే నా అభిప్రాయం... కానీ..: వైసిపి ఎమ్మెల్యే

''85% అసెంబ్లీ అంతా మిమ్మల్ని కూర్చోబెడితే 15% టిడిపికి ఇస్తే మాపై కక్ష కట్టడం ఏంటి..? ప్రజలపై కక్ష సాధించడం ఏంటి..? జగన్ కు సలహాలు ఇచ్చే దమ్ము కూడా వైసిపి మంత్రులకు లేదా..? మీ నిర్వాకాల వల్ల గ్రోత్ రేట్ పడిపోయింది. చెక్ డ్యామ్, మరుగుదొడ్డి నుంచి  పోలవరం, అమరావతి దాకా  అన్నింటిని పండబెట్టారు. పనులు లేవు, పండగలు లేవు..రేపు సంక్రాంతి కూడా చేసుకునే పరిస్థితి లేదు. 

ఏదో వడి, మరేదో బడి అని ఏడాదికి రూ.10వేలు ఇస్తా ఇంట్లో పడుకోండని చెప్పి వాళ్లకు పనులు లేకుండా చేస్తే ఏం తినాలి, ఏం పొదుపు చేయాలి..? టిడిపి పాలనలో రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో ఎన్ని అవార్డులు వచ్చాయో అదంతా పోగొట్టారు. 7నెలల్లోనే రాష్ట్రాన్ని నవ్వులపాలు చేశారు'' అని సోమిరెడ్డి జగన్  ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios