నెల్లూరు: భార్యను చంపాలని ప్రయత్నించిన భర్త పాపం పండింది. భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హత్య చేయాలని ఓ వ్యక్తి యత్నించాడు. చివరకు తానే బలయ్యాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు గ్రామంలో శనివారంనాడు చోటు చేసుకుంది. 

ఇదుపూరులో చప్పల్లి శ్రీనివాస్ (46) రాజశ్వేరమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేసి వారిని అత్తారంటికి పంపించారు. అయితే శ్రీనివాసులకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. 

Also Read: బాలీవుడ్ హీరోపై మోజు... అసూయతో భార్యను చంపిన భర్త

ఆ వ్యక్తికి శ్రీనివాసులు మూడేళ్ల క్రితం ఇందుపూరులో రూ. 6 లక్షల అప్పు ఇప్పించాడు. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి గ్రామం నుంచి వెళ్లిపోయాడు. దాంతో అప్పిచ్చినవ్యక్తి శ్రీనివాసులుపై ఒత్తిడి పెంచాడు. ఆ సమస్యతో శ్రీనివాసులు సతమవుతున్న సమయంలోనే తన భార్య రాజేశ్వరమ్మపై అనుమానం పొడసూపింది. కొంత కాలంగా ఇరువురికి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి.

Also read:టీచర్ కదా అని ఇంటికి వెళ్తిన విద్యార్థినిపై అఘాయిత్యం..

దాంతో భార్యను చంపేందుకు శ్రీనివాసులు పథకరచన చేశాడు. అందులో భాగంగా శనివారంనాడు ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు తాడు బిగించి భార్యను ఉరితీయాలని ప్రయత్నించాడు. దాంతో రాజేశ్వరమ్మ పెద్దగా కేకలు పెట్టింది. దాంతో పరుగెత్తుకొచ్చిన స్థానికులు రాజేశ్వరమ్మను కాపాడి అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Also Read: అనుమానం.. తాగిన మత్తు.. భార్యను చంపిన భర్త

రాజేశ్వరమ్మ ప్రాణాలు కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న క్రమంలో శ్రీనివాసులు అదే తాడును మెడకు బిగించుకుని ఉరేసుకున్నాడు. ఆ విషయాన్ని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. ఆ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రఘునాథ్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.  

Also Read: tik tok: టిక్ టాక్ లో వీడియోలు... భార్యను చంపిన భర్త