Asianet News TeluguAsianet News Telugu

గుడ్‌న్యూస్: మరో కరోనా వ్యాక్సిన్ విరాఫిన్‌కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్

కరోనా రోగులకు  అత్యవసరంగా  వినియోగించుకొనేందుకు విరాఫిన్ అనే ఔషదాన్ని వినియోగించుకొనేందుకు కేంద్రం శుక్రవారం నాడు అనుమతించింది.  

Zydus Virafin gets emergency use approval for treating moderate COVID-19 cases lns
Author
New Delhi, First Published Apr 23, 2021, 3:51 PM IST

న్యూఢిల్లీ: కరోనా రోగులకు  అత్యవసరంగా  వినియోగించుకొనేందుకు విరాఫిన్ అనే ఔషదాన్ని వినియోగించుకొనేందుకు కేంద్రం శుక్రవారం నాడు అనుమతించింది.  జైడస్ కంపెనీ ఈ మందును తయారు చేసింది. డీసీజీఐ విరాఫిన్ మందును ఇండియాలో ఉపయోగించుకొనేందుకు అనుమతిస్తున్నట్టుగా ఇవాళ ప్రకటించింది. 

విరాఫిన్ తో చికిత్స పొందిన రోగుల్లో 91.15 శాతం ఫలితాలు వచ్చినట్టుగా  జైడస్ సంస్థ తెలిపింది. మధ్యస్థ కరోనా లక్షణాలు ఉన్న రోగుల్లో ఈ మందు అద్భుత ఫలితాలను ఇస్తోందని తెలిపింది. కరోనా రోగులపై సింగిల్ డోస్‌తోనే ఈ ఔషదం పనిచేయనుందని ఆ సంస్థ ప్రకటించింది.  కరోనా రోగులు వేగంగా కోలుకోవడంతో పాటు ఇతర సమస్యలను నివారించేందుకు  ఈ మందు పనిచేస్తోందని జైడస్ సంస్థ తెలిపింది.

వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే ఈ మందును ఉపయోగించాల్సి ఉంటుంది. దేశంలోని 20 నుండి 25 కేంద్రాల్లో  మల్టీ సెంట్రిక్ ట్రయల్ లో విరాఫిన్ ఔషధం ఉపయోగించిన రోగుల్లో ఆక్సిజన్ సంబంధమైన సమస్యలు తక్కువగా వచ్చినట్టుగా తెలిపారు.శ్వాస సంబంధమైన ఇబ్బందులను కూడ ఈ మందు నివారించినట్టుగా ఆ కంపెనీ వివరించింది. కరోనాతో బాధపడుతున్న రోగులపై ఈ మందు బాగా ప్రభావం చూపుతోందని ఆ కంపెనీ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios