జైకోవ్ డి కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.   కరోనా అత్యవసర వినియోగానికి  డీసీజీఐ అనుమతి ఇచ్చింది. 12 ఏళ్లు దాటిన వారికి కూడ ఈ టీకా ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. 

న్యూఢిల్లీ: జైకోవ్ డి కరోనా టీకాకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ ను ఉపయోగించుకొనేందుకు డీసీజీఐ శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.

12 ఏళ్లు దాటిన వారికి కూడ జైకోవ్ డి టీకా వేసేందుకు అనుమతి లభించింది. ప్రపంచంలోనే తొలిసారిగా స్వదేశీ అభివృద్ది చెందిన డిఎన్ఏ అధారిత వ్యాక్సిన్ గా పేరొందింది.

ఈ ఏడాది జూలై 1న అహ్మదాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ టీకా కోసం డీసీజీఐకి అత్యవసర వినియోగం కోసం ధరఖాస్తు చేసుకొంది. భారతదేశంలో ఇప్పటివరకు 50కిపైగా కేంద్రాల్లో ఈ టీకా కోసం అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టుగా కంపెనీ తెలిపింది.

సీరం ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్, రష్యా స్పుత్నిక్ వీ, యూఎస్ తయారు చేసిన మోడెర్నా, జాన్సన్ జాన్సన్ కంపెనీల టీకాల తర్వాత దేశంలో ఆమోదం పొందిన ఆరో కరోనా వ్యాక్సిన్ గా జైకోవ్ -డీ మారింది.