Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ మిస్టర్ బీన్ తో... పాకిస్తాన్ ట్రోల్ చేసిన జొమాటో...!

పాక్ తప్ప.. ఏ జట్టు గెలిచినా పర్వాలేదు అన్నట్లుగా... నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా... ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సైతం  పాకిస్తాన్ ని ట్రోల్ చేయడం గమనార్హం. ఫేక్ మిస్టర్ బీన్ ఫోటో పెట్టి మరీ ట్రోల్ చేసింది. దీంతో... ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Zomato savage tweet about the Pakistani Mr Bean fiasco is viral.
Author
First Published Oct 29, 2022, 10:35 AM IST

టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ కి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరసగా మ్యాచ్ లు ఓడిపోతుంది. ఇప్పటికే టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. గురువారం జింబాబ్వేతో  జరిగిన మ్యాచ్ లోనూ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దీంతో... అందరూ.. పాకిస్తాన్ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. పాక్ తప్ప.. ఏ జట్టు గెలిచినా పర్వాలేదు అన్నట్లుగా... నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా... ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సైతం  పాకిస్తాన్ ని ట్రోల్ చేయడం గమనార్హం. ఫేక్ మిస్టర్ బీన్ ఫోటో పెట్టి మరీ ట్రోల్ చేసింది. దీంతో... ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

పాకిస్తాన్ కీ, మిస్టర్ బీన్ ఉన్న సంబంధం ఏమిటంటే...  మిస్టర్ బీన్’ రోవన్ అట్కీసన్‌కి జింబాబ్వేలో బీభత్సమైన క్రేజ్ ఉంది... దీన్ని పాక్ మరోలా వాడడమే! పాక్ క్రికెట్ బోర్డు, జింబాబ్వేతో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నామంటూ ప్రాక్టీస్ సెషన్స్‌లోని ఫోటోలను ట్విట్టర్‌లో ఫోటో చేసింది. దీనికి ఓ జింబాబ్వే నెటిజన్ స్పందించిన తీరు, హాట్ టాపిక్ అయ్యింది... ‘జింబాబ్వే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ క్షమించరు. మిస్టర్ బీన్ రోవన్ అని చెప్పి, ఓ మోసగాడు పాక్ బీన్‌ని పంపించారు. మేం దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం. వాన రావాలని కోరుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు.

 

‘ఏం జరిగిందని’ ఓ పాక్ నెటిజన్ ఆసక్తిగా ప్రశ్నించాడు. ‘మిస్టర్ బీన్ రోవన్‌ని పంపిస్తామని చెప్పి, ఓ నకిలీ మోసగాడిని పంపించారు...’ అంటూ రిప్లై ఇచ్చాడు జింబాబ్వే నెటిజన్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

ఓవరాక్షన్ చేస్తూ మూతీతో వెకిలి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే ఈ ‘ఫేక్ పాక్ బీన్’, 12 ఏళ్ల క్రితం అప్పటి పాక్ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీతో కలిసి ఓ యాడ్‌లో కూడా నటించడం విశేషం. పాక్ పంపిన నకిలీ మిస్టర్ బీన్‌కి జింబాబ్వే ప్రభుత్వం అధికారిక భద్రతా ఏర్పాట్లు చేసి వీధుల్లో ఊరేగించింది. వీడే అసలైన మిస్టర్ బీన్ అనుకుని, రాచ మర్యాదలతో సత్కరించింది. సన్మాన కార్యక్రమాలు నిర్వహించింది.

జింబాబ్వే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేస్తున్న ఆ పాక్ ఫేక్ బీన్, అక్కడ జనాల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేశాడట. కోట్ల రూపాయలతో దేశం దాటాడని సమాచారం. 

ఇప్పుడు ఇదే విషయాన్ని.. జొమాటో ప్రస్తావిస్తూ ట్రోల్ చేయడం గమనార్హం. జొమాటో ట్వీట్ కి నెటిజన్లు సైతం విపరీతంగా స్పందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios