Asianet News TeluguAsianet News Telugu

‘అప్పుడప్పుడు ఇంటి భోజనం చేయండి’ జొమాటో ట్వీట్ కి... హిలేరియస్ స్పందన

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గురించి తెలియని వాళ్లు ఉండరు. స్విగ్గీ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న ఫుడ్ డెలివరీ  యాప్ ఇది. అయితే.... గత వారం జొమాటో తన కష్టమర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. 

Zomato's Viral "Ghar Ka Khana" Tweet Triggers Hilarious Responses
Author
Hyderabad, First Published Jul 9, 2019, 2:24 PM IST

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గురించి తెలియని వాళ్లు ఉండరు. స్విగ్గీ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న ఫుడ్ డెలివరీ  యాప్ ఇది. అయితే.... గత వారం జొమాటో తన కష్టమర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. కాగా ఆ ట్వీట్ కి హిలేరియస్ స్పందన రావడంతో ఇప్పుడు నెట్టింట ఈ టాపిక్ వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తన కష్టమర్లను ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ‘‘ అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా చేయండి’’ అంటూ జొమాటో ట్విట్టర్ లో పేర్కొంది. నిజానికి అందరూ ఇంటి భోజనాన్నే ప్రిఫర్ చేస్తే జొమాటో లాంటి కంపెనీకి ఆదాయం ఉండదు. అయినప్పటికీ.. మంచి మాటగా ఇంటి భోజనం చేస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కి చాలా మంది కనెక్ట్ అయిపోయారు. సాధారణ ప్రజలతోపాటు పలు ప్రముఖ కంపెనీలు కూడా ఈ ట్వీట్ కి ఫన్నీగా స్పందించడం విశేషం.

యూట్యూబ్ ఇండియా చేసిన ట్వీట్‌లో.. అప్పుడప్పుడు రాత్రి 3గంటలకైనా ఫోన్ పక్కకుపెట్టేసి నిద్రపోండంటూ ట్వీట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేస్తూ అప్పుడప్పుడు కేబుల్‌పై కూడా కొంచెం ధ్యాస పెట్టండని ట్వీట్ చేసింది. ట్రావెలింగ్ సైట్ ఇక్సిగో ట్వీట్ చేస్తూ.. అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొండని ట్వీట్ చేయగా, మొబిక్విక్ చేసిన ట్వీట్‌లో అప్పుడప్పుడు క్యూలో నిలబడి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టండి. మరో ఫుడ్ యాప్ ఫాసూస్ ట్వీట్ చేస్తూ అప్పుడప్పుడు సొంతగా వంట చేయడం నేర్చుకోండని ట్వీట్ చేసింది. వారందరి ట్వీట్స్ కి కూడా జొమాటో కౌంటర్ ఇచ్చింది. ‘‘అప్పుడప్పుడు మంచి ట్వీట్స్ కూడా ఆలోచించండి’’ అని ట్విట్టర్ లో పేర్కొంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios