Zomato Delivery Boy: హృదయవిదారకం! గుండెలు పిండేస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో..

Zomato Delivery Boy: ఎండ, వాన, చలి ఇవేమీ లెక్కచేయక.. మనం ఆర్డర్ చేసిన ఆహారాన్ని పదిలంగా మనకు అందజేస్తారు పుడ్ డెలవరీ బాయ్స్.  తాజాగా వారి దయానీయ పరిస్తితులను తెలియజేస్తే వీడియో ఒకటి వెలుగుచూసింది.

Zomato delivery agent eating food from plastic bag moves netizens KRJ

Zomato Delivery Boy: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది.  నిమిషాల వ్యవధిలో  మనకు ఇష్టమైన రెస్టారెంట్‌ల నుండి ఏది కావాలంటే..అది ఆర్డర్ చేయవచ్చు. మన ఇంటి ముందుకే తెప్పించుకోవచ్చు. అయితే.. మీ ఇంటి వద్దకు సకాలంలో ఆహారాన్ని పంపిణీ చేసే డెలివరీ బాయ్  జీవితం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మనకు పుడ్ డెలవరీ చేసే సమయంలో వారు ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొంటున్నారు. ఎండ, వాన, చలి ఇవేమీ లెక్కచేయక మనం ఆర్డర్ చేసిన పుడ్ ను పదిలంగా మన వద్దకు చేర్చుతారు. మన ఆకలిని తీర్చే బాధ్యతలో వారు తమ కడుపులను మాడ్చుకుంటారు. నిజానికి వారికి అన్నం తినడానికి కూడా సరైనా సమయం దొరకదు. కొన్ని కడుపు మాడ్చుకోవాల్సిందే.. వారి దయానీయ పరిస్థితిని అద్దం పట్టే ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌ పక్కన నిల్చోని ప్లాస్టిక్ కవర్‌లో అన్నం తింటూ కనిపిస్తున్నాడు. బైక్‌పై జొమాటో ఫుడ్ బాక్స్ ఇన్‌స్టాల్ చేయబడింది. అతడు ఖచ్చితంగా  జొమాటో డెలివరీ బాయే. ఆ డెలివరీ బాయ్ భోజనం చేస్తూ చూట్టు చూస్తూ తింటున్నాడు. తినే విధానం చూస్తుంటే..  హడావిడిగా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవ్నీష్ శరణ్ కూడా షేర్ చేశారు. ఆయన వీడియోను షేర్ చేస్తూ.. " సంక్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న ఇలాంటి వారిని పట్ల జాగ్రత్త తీసుకోండి" అని రాశాడు.

 
ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై జనాలు ఎమోషనల్ రియాక్షన్స్ ఇచ్చారు. ఈ వీడియోపై ఓ నెటిజన్  ఇలా రియాక్టయ్యారు."మనకు ఆహారాన్ని  సమయానికి  అందించడానికి..వారు తరచుగా ఆకలితో ఉంటారు. ఇది విచారకరమైన వాస్తవం. ఈ వీడియో హృదయాన్ని కదిలించేవి." అని కామెంట్ చేశారు.

అదే సమయంలో, మరొక నెటిజన్  ఉద్వేగభరితంగా ఇలా వ్రాశాడు. "అయ్యో పాపం! కష్టపడి పనిచేసే వ్యక్తికే ఆకలి విలువ తెలుస్తోంది. రేపటి నుండి డెలివరీ చేసే వ్యక్తులకు  నీరు, ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా వల్ల ఇతరులు కూడా మారవచ్చు. ఇతరులు కూడా ఇలా చేయడం ప్రారంభించాలి అని కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఆర్డర్ చేసిన పుడ్ రెండు నిమిషాలు ఆలస్యమైతే చాలు డెలివరీ బాయ్స్ మీద తెగ ఫైర్ అవుతుంటారు. అలాంటి వారు ఈ వీడయో చూసైనా వారి పరిస్థితి  అర్థం చేసుకుంటే బావుంటుంది.

ఇటీవలి కాలంలో Swiggy, Zomato, Grofers, Zepto, Big Basket వంటి ఫుడ్, గ్రోసరీ డెలివరీ యాప్‌లు పోటీని దృష్టిలో ఉంచుకుని 30 నిమిషాల్లోపే ఆర్డర్‌లను అందించడం ప్రారంభించాయి (కొన్ని యాప్‌లు 10 నిమిషాల కన్నా తక్కువ వాగ్దానం చేస్తాయి). ఈ చాలెంజ్ ప్రభావం డెలివరీ చేసే వ్యక్తులపై పడింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios