Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ బ్లూ టిక్ కోసం డిస్కౌంట్ కావాలని ఎలన్ మస్క్‌తో బేరమాడిన జొమాటో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

ట్విట్టర్‌లో బ్లూ టిక్ కోసం నూతన యజమాని ఎలన్ మస్క్ నెలకు 8 డాలర్లు చెల్లించాలని నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనపై చాలా మంది యూజర్లు రియాక్ట్ అయ్యారు. దీనిపై జొమాటో స్పందిస్తూ బేరమాడింది.
 

zomato bargains with elon musk bargaining for twitter blue tick
Author
First Published Nov 4, 2022, 2:16 PM IST

న్యూఢిల్లీ: ట్విట్టర్ కొత్త యజమాని, బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ వెరిఫికేషన్ బ్లూ టిక్‌కు ఓ ధర నిర్ణయించిన సంగతి తెలిసిందే. బ్లూ టిక్ ఉన్నవారు ప్రతి నెలా ఎనిమిది అమెరికన్ డాలర్లు చెల్లించాలని రూల్ తెచ్చారు. ఈ నిబంధనపై ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎలన్ మస్క్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఎవరు వాదించినా.. ఎనిమిది డాలర్లు చెల్లించాలని స్పష్టం చేస్తూనే ఉన్నారు.

బ్లూ టిక్‌లకు చార్జ్ చేసి వచ్చిన డబ్బును కంటెంట్ క్రియేటర్లకు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని ఎలన్ మస్క్ తెలిపారు. ఈ చార్జ్ పై చాలా మంది యూజర్లు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చాలా మంది యూజర్లు ఈ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఇదే సంభాషణలోకి జొమాటో కూడా జంప్ అయింది.

జొమాటో పూర్తి దేశీ స్టైల్‌లో ట్వీట్ చేసింది. నెలకు 8 డాలర్లు చెల్లించాలని ఎలన్ మస్క్ నిబంధన తెచ్చారు. జొమాటో కూడా ఈ డాలర్లపై బేరమాడింది. ఎలన్ మస్క్‌తో డిస్కౌంట్ ఆఫర్ పేర్కొంటూ బేరమాడింది. 8 డాలర్లలో 60 శాతం వరకు డిస్కౌంట్ చేయాలని కోరింది. 8 డాలర్లకు బదులు 5 డాలర్లు చెల్లిస్తామని బేరమాడుతూ ట్వీట్ చేసింది. ఓకే ఎలన్..  8 డాలర్లలో 60 శాతం ఆఫ్ ఇచ్చి 5 డాలర్లకు ఈ చార్జ్ తగ్గించాలని బార్గెయిన్ చేసింది.

Also Read: ట్విట్టర్ సంచలన నిర్ణయం.. నేడు ఉద్యోగాల కొతతో పాటు తాత్కాలికంగా ఆఫీసుల మూసివేత..

ఈ ట్వీట్ పై నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. కొందరు నెటిజన్లు హాహాహా అంటూ నవ్వుతూ పోస్టులు పెట్టారు. డిసెంబర్ 31వ తేదీలోపు చెల్లిస్తే మరో 10 శాతం డిస్కౌంట్ వస్తుందని ట్వీట్ చేశారు. మేము కూడా మీ దారినే అనుసరిస్తే ఆ ఎంఆర్‌పీని 11 డాలర్లు చూపిస్తామని, అందులో డిస్కౌంట్ ఇస్తే అది 8.2 డాలర్లకు తగ్గుతుందని అన్నారు. అప్పుడు ట్యాక్స్‌లు, సర్వీస్ చార్జీలు, డిమాండ్ కలిపితే మొత్తం 11.5 డాలర్లు అవుతుందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇంకొకరు ప్యాకింగ్ చార్జీ, ట్యాక్స్, టిప్, జీఎస్టీతోపాటు 8 డాలర్లు చేస్తారని ఇంకొకరు పోస్టు చేశారు. ఇంకొకరు భారతీయులు బేరమాడే అవకాశాన్ని ఎప్పుడూ మిస్ చేసుకోరూ అంటూ కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios