లక్నో: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడం వల్ల ఏమీ జరగబోదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.

తూర్పు ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా ప్రియాంకగాంధీని నియమించిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక రావడం వల్ల అద్భుతాలు లేవన్నారు. సున్నాకి సున్నా తోడైతే సున్నాయే వస్తోందన్నారు.

 కాంగ్రెస్ అంటే బండ సున్నా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరారనే విషయం ముఖ్యం కాదన్నారు. ఎవరు ఆ పార్టీలో చేరినా ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ యూపీలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా ప్రియాంకకు ఈ పదవిని అప్పగించింది.