పార్లమెంట్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. శివసేన, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌లు ఆయనకు మద్ధతుగా నిలిచాయి.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంట్‌లో కీలక పదవి లభించింది. పార్లమెంట్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. ప్రయారిటీ 1 ఓట్లతో గెలిచారు విజయసాయిరెడ్డి. శివసేన, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌లు ఆయనకు మద్ధతుగా నిలిచాయి. మొత్తం 7 ఖాళీలకు గాను 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. అలాగే పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బీజేపీ నేత లక్ష్మణ్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Scroll to load tweet…
