పార్లమెంట్‌లో వివిధ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని వాణిజ్యంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు.

ఈ కమిటీలో 21  మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో పరిశ్రమల వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు, హోంశాఖ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఆనంద్ శర్మ, రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా జోయల్ ఓరం, విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా పీపీ చౌదరి, ఇన్ఫర్మేషణ్ టెక్నాలజీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా శశిథరూర్‌ను నియమించారు.

అలాగే వివిధ స్థాయి సంఘాల్లో సభ్యులుగా రాహుల్ గాంధీ, అభిషేక్ మను సింఘ్వీ కొనసాగనున్నారు.