17వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ప్రతిపాదించిన ఓమ్ బిర్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించింది. మంగళవారం లోక్‌సభ స్పీకర్‌గా నామినేషన్ వేస్తున్న ఆయనను ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనకు వైసీపీ లోక్‌సభా పక్షానేత మిథున్ రెడ్డి సంతకం చేశారు. వైసీపీతో పాటు శివసేన,  బీజేడీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, మిజో నేషనల్ ఫ్రంట్, అకాలీ దళ్, లోక్‌ జన్‌శక్తి పార్టీ, జేడీయూ, అన్నాడీఎంకే, అప్నాదళ్ పార్టీలు ఓం బిర్లాకు మద్ధతుగా సంతకాలు చేశాయి.

మరోవైపు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో జగన్ పాల్గొంటారు.